శాస్త్రవేత్త నుంచి మోదీ ప్రైవేట్ సెక్రటరీ వరకు.. నిధి తివారీ ఎవరో తెలుసా?
- బీహెచ్‌యూలో బయోకెమిస్ట్రీ పీజీలో గోల్డ్ మెడల్
- బార్క్‌లో శాస్త్రవేత్తగా పనిచేసిన నిధి తివారీ
- 2008లో బార్క్ ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్ ప్రిపరేషన్
- 2013 యూపీఎస్సీలో 96వ ర్యాంకుతో ఐఎఫ్‌ఎస్‌కు ఎంపిక
- 2022లో పీఎంవోలో అండర్ సెక్రటరీగా చేరిక
ఆమె లక్నోలో చదువుకున్న ఓ ఉన్నత విద్యావంతురాలు.. బాబా అణు పరిశోధన కేంద్రంలో శాస్త్రవేత్తగా ఉద్యోగం.. ఆ తర్వాత సివిల్స్ వైపు అడుగులు.. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రైవేట్ సెక్రటరీగా కీలక బాధ్యతలు. ఇదీ నిధి తివారీ ప్రయాణం. శాస్త్రవేత్తగా మొదలైన ఆమె కెరీర్.. విదేశాంగం, భద్రతా వ్యవహారాల్లో పనిచేసే స్థాయికి ఎలా చేరిందో చూస్తే ఆసక్తికరమే.
నిధి తివారీ ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోకు చెందినవారు. అక్కడే పాఠశాల విద్య, డిగ్రీ పూర్తి చేశారు. బీఎస్సీ తర్వాత బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో బయోకెమిస్ట్రీలో పీజీ చేశారు. ఈ కోర్సులో గోల్డ్ మెడల్ సాధించారు.
బార్క్‌లో శాస్త్రవేత్తగా..
చదువు పూర్తయ్యాక బాబా అణు పరిశోధన కేంద్రం (బార్క్)లో శాస్త్రవేత్తగా ఉద్యోగంలో చేరారు. అయితే సివిల్స్ సర్వీసులోకి వెళ్లాలన్న పట్టుదలతో ఆ ఉద్యోగాన్ని వదులుకున్నారు. 2008లో బార్క్ నుంచి బయటకు వచ్చి యూపీఎస్సీ పరీక్షకు సిద్ధమయ్యారు.
ఒక్కసారి కాదు
సివిల్స్ ప్రయాణం ఆమెకు వెంటనే విజయాన్ని అందించలేదు. 2012లో జరిగిన పరీక్షలో ఆమె పేరు వెయిటింగ్ లిస్ట్‌లో వచ్చింది. అయినా ప్రయత్నం ఆపలేదు. 2013లో మళ్లీ పరీక్ష రాశారు. ఈసారి ఆల్ ఇండియా స్థాయిలో 96వ ర్యాంకు సాధించారు. దీంతో ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్)కు ఎంపికై 2014 బ్యాచ్‌లో చేరారు.
విదేశాంగం నుంచి పీఎంవోకు
ఐఎఫ్‌ఎస్ అధికారిగా పనిచేసే సమయంలో విదేశాంగ మంత్రిత్వ శాఖలో నిరాయుధీకరణ, అంతర్జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలపై పనిచేశారు. విదేశాంగ విధానం, అంతర్జాతీయ భద్రతపై ఆమెకు వచ్చిన అనుభవం తర్వాత పీఎంవోలో కీలకంగా ఉపయోగపడింది.
2022 నవంబర్‌లో పీఎంవోలో అండర్ సెక్రటరీగా చేరారు. ఆ తర్వాత డిప్యూటీ సెక్రటరీగా పదోన్నతి పొందారు. జాతీయ భద్రతకు సంబంధించిన అంశాల్లోనూ ఆమె పనిచేశారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో కలిసి భద్రతా వ్యవహారాలపై పనిచేసిన అనుభవం కూడా ఉంది.
ఇప్పుడు ప్రధాని మోదీతో కీలక బాధ్యతలు
విదేశాంగ, అంతర్జాతీయ భద్రత, జాతీయ భద్రత అంశాల్లో అనుభవం ఉన్న నిధి తివారీ 2025 మార్చి నుంచి మోదీ ప్రైవేట్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శాస్త్రవేత్తగా మొదలైన ఆమె కెరీర్.. యూపీఎస్సీ సివిల్స్ ద్వారా ఐఎఫ్‌ఎస్ అధికారిగా, అక్కడి నుంచి పీఎంవోలో కీలక అధికారి స్థాయికి చేరింది.