లైంగిక వేధింపుల కేసు: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి 2 రోజుల పోలీస్ కస్టడీ
- రెండు రోజుల కస్టడీకి అనుమతించిన రంగారెడ్డి జిల్లా కోర్టు
- సహచర శిక్షణ అధికారిణి ఫిర్యాదుతో కేసు నమోదు
- ప్రైవేట్ చాట్స్ బయటపెడతానని బెదిరించినట్లు ఆరోపణలు
- ఆంధ్రప్రదేశ్‌లో గతంలో కానిస్టేబుల్‌గా పనిచేసిన ఉదయ్ కృష్ణారెడ్డి
తనతోపాటు శిక్షణ పొందుతున్న మహిళా అధికారిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఎం. ఉదయ్ కృష్ణారెడ్డిని రెండు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉందన్న పోలీసుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.
గతంలో ఆంధ్రప్రదేశ్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసిన ఉదయ్ కృష్ణారెడ్డి 2025 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యాడు. హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో తనతో పాటు శిక్షణ పొందుతున్న ఓ మహిళా అధికారిని వేధించినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. బాధితురాలు జులై 18న అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో, పోలీసులు భారతీయ న్యాయ సంహిత లోని లైంగిక వేధింపులు, క్రిమినల్ బెదిరింపులతో పాటు ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
జులై 28న ఉదయ్ కృష్ణారెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు, 29న 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. అప్పటి నుంచి ఆయన చంచల్‌గూడ జైలులో ఉన్నాడు. బాధితురాలు మరొకరిని వివాహం చేసుకోవడంతో, వారి ప్రైవేట్ సంభాషణలను (చాట్స్) బయటపెడతానని ఉదయ్ కృష్ణారెడ్డి బెదిరించినట్లు పోలీసులు వెల్లడించారు. వీరిద్దరికీ 2023లో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. శిక్షణ సమయంలోనూ తరచూ గొడవలకు దిగడం, ఆధిపత్య ధోరణి ప్రదర్శించడం, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం, ఆయుధాలు చూపి భయపెట్టడం వంటి చర్యలతో ఆమెను వేధించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.