చేతిలో పసిబిడ్డ.. హెలికాప్టర్ దిగుతుండగా కిందపడబోయిన ఉషా వాన్స్.. చూస్తూ ఉండిపోయిన సిబ్బంది!
- హెలికాప్టర్ దిగుతుండగా తడబడిన సెకండ్ లేడీ ఉషా వాన్స్
- ఆ సమయంలో చేతిలో తొమ్మిది వారాల కుమారుడు అలెక్ నీల్ వాన్స్
- ఘటన సమయంలో చూస్తూ ఉండిపోయిన సిబ్బంది.. నెట్టింట్లో చర్చ
- అలా ఎందుకు చేశారనే దానిపై లేని క్లారిటీ
- భద్రతా ప్రోటోకాల్ ఏదైనా అమల్లో ఉందా? అనే అనుమానం
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్య, సెకండ్ లేడీ ఉషా వాన్స్ హెలికాప్టర్ నుంచి దిగుతుండగా తడబడిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోమవారం మేరీల్యాండ్‌లోని జాయింట్ బేస్ ఆండ్రూస్‌లో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో ఉషా వాన్స్ తన తొమ్మిది వారాల కుమారుడు అలెక్ నీల్ వాన్స్‌ను బేబీ క్యారియర్‌లో తీసుకెళ్తున్నారు.
హెలికాప్టర్ మెట్లపై నుంచి కిందకు దిగుతున్న సమయంలో చివరి మెట్టు దగ్గర ఉషా ఒక్కసారిగా తడబడినట్లు వీడియోలో కనిపించింది. వెంటనే ఆమె పక్కనే ఉన్న రెయిలింగ్‌ను పట్టుకుని నిలదొక్కుకున్నారు. ఆ తర్వాత తన కుమారుడిని చూసుకుని పరిస్థితి సర్దుకున్నాక ముందుకు వెళ్లారు.
ఉషా వెనుకే జేడీ వాన్స్ కూడా హెలికాప్టర్ నుంచి దిగారు. ఆయన తమ నాలుగేళ్ల కుమార్తె మిరాబెల్‌ను ఎత్తుకుని ఉన్నారు. ఉషా తడబడిన విషయం ఆయన గమనించినట్లు వీడియోలో కనిపించలేదు. అనంతరం ఇద్దరూ తమ పిల్లలతో కలిసి అక్కడి నుంచి ముందుకు వెళ్లి, యాంకరేజ్‌కు వెళ్లాల్సిన విమానం వైపు నడిచారు.
ఈ ఘటనపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఉషా తడబడిన సమయంలో సమీపంలో ఉన్న సిబ్బంది ఎందుకు వెంటనే స్పందించలేదని కొందరు ప్రశ్నించారు. అయితే వీడియో ఆధారంగా వారు ఎందుకు జోక్యం చేసుకోలేదో చెప్పలేం. భద్రతా ప్రోటోకాల్ ఏదైనా అమల్లో ఉందా అన్నది కూడా వీడియోలో స్పష్టంగా తెలియదు.
ఉషా, జేడీ వాన్స్ దంపతులకు జులై 19న అలెక్ జన్మించాడు. బెథెస్డాలోని వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్‌లో జన్మించాడు. అలెక్ వీరి నాలుగో సంతానం.