జగన్ ఒక బీసీ ద్రోహి.. ఎన్నికలంటే భయపడుతున్నారు: బుద్ధా వెంకన్న

జగన్ ఒక బీసీ ద్రోహి.. ఎన్నికలంటే భయపడుతున్నారు: బుద్ధా వెంకన్న

Buddha Venkanna says Jagan is a BC traitor and afraid of elections
  • ఓటమి భయంతోనే స్థానిక ఎన్నికలను వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారన్న వెంకన్న
  • నవంబర్‌లోగా ఎన్నికలు జరగకపోతే రాష్ట్రానికి కేంద్ర నిధులు ఆగిపోతాయని వెల్లడి
  • బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడి
వైసీపీ అధ్యక్షుడు జగన్ బీసీల ద్రోహి అని, ఓటమి భయంతో స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్ధా వెంకన్న తీవ్రంగా విమర్శించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

ఐదేళ్ల పాలనలో బీసీలకు న్యాయం చేస్తానని చెప్పి జగన్ మోసం చేశారని వెంకన్న ఆరోపించారు. ఓటమి భయంతో వైసీపీ అభ్యర్థులను నిలబెట్టే పరిస్థితిలో లేదని, అందుకే పదేపదే కోర్టుల్లో పిటిషన్లు వేస్తూ ఎన్నికల ప్రక్రియను ఆలస్యం చేయాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. నవంబర్‌లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోతే రాష్ట్రానికి రావాల్సిన వందల కోట్ల రూపాయల కేంద్ర నిధులు ఆగిపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.

వైసీపీ తన ఎన్నికల గుర్తు ఫ్యాన్‌కు బదులుగా గొడ్డలి పెట్టుకోవాలని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం పేదలకు ఇళ్ల పట్టాలు, రిజిస్ట్రేషన్ సౌకర్యాలు అందిస్తోందని తెలిపారు. బీసీల సమస్యల్లో జోక్యం చేసుకోవద్దని జగన్‌ను హెచ్చరించిన వెంకన్న, రాష్ట్రవ్యాప్తంగా బీసీలకు జరిగిన అన్యాయాన్ని ఎండగడతామని అన్నారు. 

పోలీసు యంత్రాంగం బాగా పని చేస్తోంది కాబట్టే వైసీపీ నేతలు రోడ్లపైకి వచ్చి రంకెలు వేస్తున్నారని అన్నారు. పోలీసులు సరిగా పని చేయకపోతే... వైసీపీ వాళ్లు రోడ్లపైకి వచ్చే సాహసం కూడా చేసేవారు కాదని చెప్పారు. పోలీసులను విమర్శించే అర్హత వైసీపీ నేతలకు లేదని అన్నారు.

స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను, మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించరాదన్న సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ ఏపీ హైకోర్టు ఇటీవల పక్కనపెట్టిన విషయం తెలిసిందే. ఈ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 
Advertisement
Buddha Venkanna
Jagan Mohan Reddy
BC Reservations
AP Local Body Elections
YSRCP
TDP Alliance

More Telugu News