ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ!
- బ్యాటింగ్ కోచ్‌గా యువరాజ్ సింగ్?
- కోచింగ్ సిబ్బందిని పూర్తిగా తొలగించిన ఢిల్లీ క్యాపిటల్స్
- జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్ చేతికి డీసీ నిర్వహణ బాధ్యతలు
- త్వరలోనే కొత్త కోచ్‌ల బృందంపై అధికారిక ప్రకటన
- ఇప్పటికే జట్టులోకి తిరిగొచ్చిన మాజీ కెప్టెన్ రిషభ్ పంత్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2027 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. జట్టు ప్రస్తుత కోచింగ్ సిబ్బందిని పూర్తిగా తొలగిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. హేమాంగ్ బదానీ నేతృత్వంలోని బృందానికి ధన్యవాదాలు తెలుపుతూ, త్వరలోనే కొత్త కోచ్‌లను నియమించనున్నట్లు సంకేతాలిచ్చింది.
2024లో సహ యజమాని జేఎస్‌డబ్ల్యూతో కుదిరిన ఒప్పందం ప్రకారం, 2025, 2026 సీజన్లకు జీఎంఆర్ గ్రూప్ జట్టు నిర్వహణ బాధ్యతలు చేపట్టింది. ఈ సమయంలో హేమాంగ్ బదానీ హెడ్ కోచ్‌గా, వేణుగోపాల్ రావు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా, మునాఫ్ పటేల్ బౌలింగ్ కోచ్‌గా, ఇయాన్ బెల్ అసిస్టెంట్ కోచ్‌గా, జాన్ మూనీ ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరించారు. ఇప్పుడు 2027, 2028 సీజన్లకు నిర్వహణ బాధ్యతలు జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్ చేతికి మారడంతో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి.
కొత్త కోచింగ్ బృందంపై ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడుతుందని తెలిపింది. జేఎస్‌డబ్ల్యూ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా ఉన్న సౌరవ్ గంగూలీ హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ బ్యాటింగ్ కోచ్‌గా, శ్రీలంక దిగ్గజం చమిందా వాస్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా, మాజీ స్పిన్నర్ అమిత్ మిశ్రా స్పిన్ బౌలింగ్ కోచ్‌గా నియమితులు కానున్నట్లు తెలుస్తోంది. యువరాజ్, మిశ్రాలకు ఇదే తొలి కోచింగ్ బాధ్యత కానుంది.
అయితే, గంగూలీ ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) అధ్యక్షుడిగా ఉన్నందున, ఆయన నియామకంపై 'ప్రయోజనాల విరుద్ధత' నిబంధన వర్తిస్తుందా? లేదా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. 2019లో డీసీకి సలహాదారుగా ఉన్నప్పుడు కూడా ఈ సమస్య తలెత్తగా, క్యాబ్ అధ్యక్ష పదవి గౌరవప్రదమైనదేనని ఆయన వివరణ ఇచ్చారు. ఇటీవల బెంగళూరు, ఢిల్లీల్లో జరిగిన డీసీ ట్రయల్స్‌లో గంగూలీ, యువరాజ్, మిశ్రా పాల్గొనడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది.
ఇటీవలే లక్నో సూపర్ జెయింట్స్‌కు కుల్దీప్ యాదవ్‌ను ఇచ్చి, తమ మాజీ కెప్టెన్ రిషభ్ పంత్‌ను డీసీ తిరిగి జట్టులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. గత సీజన్‌లో 6వ స్థానంలో నిలిచిన ఢిల్లీ జట్టు, తొలి ఐపీఎల్ టైటిల్ వేటను కొత్త కోచింగ్ బృందంతో కొనసాగించనుంది.