పుట్టినరోజున ‘మెనీ హ్యాపీ రిటర్న్న్’ ఎందుకు చెబుతారు? ఈ మాట వెనుక అసలు అర్థం ఇదే!
- ‘మెనీ హ్యాపీ రిటర్న్స్’ అనేది పాత ఆంగ్ల పదబంధం
- పుట్టినరోజు మళ్లీ మళ్లీ రావాలని కోరే మాట
- ప్రతి పుట్టినరోజూ సంతోషంగా ఉండాలని ఆకాంక్ష
- ఆరోగ్యం, ఆనందం, ప్రశాంతతను కోరుతూ చెప్పే విషెస్
- గతంలో ఇతర శుభ సందర్భాల్లోనూ వాడే ఆచారం
పుట్టినరోజు అంటే కేక్, కొవ్వొత్తులు, బహుమతులు.. ఇక విషెస్ చెప్పేటప్పుడు చాలామంది తప్పకుండా ఒక మాట అంటారు.. “మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే”. చిన్నప్పటి నుంచి ఈ మాట వింటూనే ఉన్నాం. మనం కూడా ఎవరికైనా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేటప్పుడు వాడుతుంటాం. కానీ.. అసలు ఈ మాటకు అర్థమేంటి? ‘రిటర్న్స్’ అంటే ఏంటి? పుట్టినరోజునే అలా ఎందుకు అంటారు?
‘రిటర్న్స్’ అంటే ఇదే..
సింపుల్‌గా చెప్పాలంటే.. మీరు పుట్టిన ఈ ప్రత్యేకమైన రోజు ప్రతి ఏడాది మళ్లీ మళ్లీ రావాలని కోరుకోవడమే ‘మెనీ హ్యాపీ రిటర్న్స్’లోని అసలు భావం. ఉదాహరణకు అక్టోబర్ 6న మీ పుట్టినరోజు అనుకుందాం. వచ్చే ఏడాది మళ్లీ అక్టోబర్ 6 వస్తుంది. ఆ తర్వాత మరో ఏడాది కూడా వస్తుంది. ఇలా మీ జీవితంలో మరెన్నో అక్టోబర్ 6లు సంతోషంగా జరుపుకోవాలని కోరుతూ ఈ మాట చెబుతారు. అంటే.. “ఈ రోజు మళ్లీ మళ్లీ రావాలి. ప్రతి సారి ఆనందంగా జరుపుకోవాలి” అన్నదే దీని అర్థం.
కేవలం ఎక్కువ కాలం బతకాలని కాదు..
ఇక్కడ ‘హ్యాపీ’ అనే పదానికి చాలా ప్రాధాన్యం ఉంది. పుట్టినరోజులు మరెన్నో రావాలని మాత్రమే కాదు.. ప్రతి పుట్టినరోజూ సంతోషంగా ఉండాలని కోరడం ఇందులో ఉంటుంది. ఆరోగ్యం, ఆనందం, ప్రశాంతత, విజయం.. ఇవన్నీ జీవితంలో ఉండాలని కోరుతూ చెప్పే శుభాకాంక్ష ఇది. అందుకే సాధారణంగా చెప్పే ‘హ్యాపీ బర్త్‌డే’ కంటే ‘మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్’లో భవిష్యత్తుపై ఒక మంచి ఆకాంక్ష కూడా ఉంటుంది.
పుట్టినరోజులకే పరిమితం కాదు..
‘మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్’ అనేది పాత ఆంగ్ల పదబంధం. ముఖ్యమైన సందర్భాల్లో శుభాకాంక్షలు చెప్పేందుకు దీన్ని గతంలో ఉపయోగించేవారు. పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాల వంటి సందర్భాల్లోనూ ఈ మాటను వాడేవారు.
కాలం గడిచేకొద్దీ ఈ పదబంధం పుట్టినరోజు శుభాకాంక్షలతో బాగా ముడిపడిపోయింది. ఇప్పుడు ఎవరైనా “మెనీ హ్యాపీ రిటర్న్స్” అంటే ఎక్కువగా పుట్టినరోజు శుభాకాంక్షలే గుర్తుకొస్తాయి.
‘మెనీ హ్యాపీ రిటర్న్స్’ అని మాత్రమే ఎందుకు అంటారు?
మొదట్లో పూర్తి పదబంధం “మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే”గా ఉండేది. రోజువారీ మాటల్లో అది క్రమంగా చిన్నదై “మెనీ హ్యాపీ రిటర్న్స్”గా మారింది. పదాలు తగ్గినా.. అసలు భావం మాత్రం మారలేదు. మీరు పుట్టిన ఈ రోజు జీవితంలో మరెన్నోసార్లు తిరిగి రావాలి. ప్రతిసారీ ఆనందాన్ని తీసుకురావాలి. ఇదే ఆ మాటలోని కోరిక.