ఎండల నుంచి ఉపశమనం.. జపాన్‌లో మనుషుల కోసం ప్రత్యేక 'రిఫ్రిజిరేటర్’
- మనుషుల కోసం ప్రత్యేక రిఫ్రిజిరేటర్‌ను రూపొందించిన జపాన్ సంస్థ
- 'డో హిమోన్ బాక్స్'లో కూర్చుంటే చల్లటి గాలి
- వడదెబ్బ, అధిక వేడి ప్రభావం తగ్గించడమే ప్రధాన లక్ష్యం
- ఉష్ణోగ్రత 15 డిగ్రీలు, 5 డిగ్రీలతో చల్లటి గాలి
- ఇప్పటికే 200 యూనిట్లు విక్రయించిన సంస్థ
- విదేశాల నుంచి కూడా ఈ పరికరంపై ఆసక్తి
ఎండల తీవ్రత పెరుగుతున్న వేళ జపాన్‌లో ఓ వినూత్న పరికరం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. మనుషులు కొద్దిసేపు కూర్చొని శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకునేలా ప్రత్యేకంగా రూపొందించిన ‘డో హిమోన్ బాక్స్’ అనే హ్యూమన్ రిఫ్రిజిరేటర్‌ను అక్కడి ట్రుస్కో నకయామా సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పరికరం ముఖ్యంగా వడదెబ్బ, అధిక వేడి కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలను తగ్గించేందుకు ఉపయోగపడేలా రూపొందించారు.
చూడటానికి పెద్ద స్టీల్ ఫ్రిజ్‌లా కనిపించే ఈ పరికరంలో ఒక వ్యక్తి కూర్చునేంత స్థలం ఉంటుంది. గాజు తలుపు మూసిన వెంటనే తల, మెడ, భుజాలపై చల్లటి గాలి వేగంగా తగులుతుంది. దీంతో కొద్ది నిమిషాల్లోనే శరీరానికి చల్లదనం అందుతుంది.
ఈ బాక్స్‌లో ఉష్ణోగ్రతను 15 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంచుతారు. ఎవరైనా లోపల కూర్చోగానే 5 డిగ్రీల చల్లటి గాలిని నేరుగా పంపేలా దీన్ని రూపొందించారు. విశ్రాంతి కోసం కాకుండా, వేడి ప్రభావం తీవ్రం కాకముందే శరీరాన్ని చల్లబరచడమే దీని ప్రధాన ఉద్దేశమని సంస్థ తెలిపింది.
ఈ ఏడాది ప్రారంభంలో మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత ఇప్పటికే దాదాపు 200 యూనిట్లు విక్రయించినట్టు సంస్థ వెల్లడించింది. ఉక్కు కర్మాగారాలు, నిర్మాణ రంగం, గోల్ఫ్ మైదానాలు, విశ్వవిద్యాలయాలు, వినోద కేంద్రాలు వీటిని కొనుగోలు చేశాయి.
ఇటీవల కుమమోటోలో సంభవించిన భూకంపం తర్వాత సహాయ శిబిరాలకు కూడా ఈ పరికరాలను పంపినట్టు సంస్థ తెలిపింది. విద్యుత్ ప్లగ్ ఉంటే ఎక్కడైనా వీటిని ఉపయోగించవచ్చని పేర్కొంది.
జపాన్‌లో వేసవిలో ఉష్ణోగ్రతలు తరచూ 35 డిగ్రీల సెల్సియస్ దాటుతున్నాయి. వడదెబ్బ ప్రమాదంపై అక్కడి వాతావరణ శాఖ తరచూ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ పరిస్థితుల్లో ఇలాంటి పరికరాలకు డిమాండ్ పెరుగుతోందని సంస్థ చెబుతోంది.
జర్మనీ, అమెరికా సహా పలు దేశాల నుంచి కూడా ఈ హ్యూమన్ రిఫ్రిజిరేటర్‌పై వివరాలు అడుగుతున్నారని ట్రుస్కో నకయామా ప్రతినిధులు తెలిపారు. భవిష్యత్‌లో షాపింగ్ మాల్స్, వేసవి ఉత్సవాలు, ఎక్కువ మంది చేరే ప్రాంతాల్లో కూడా వీటి వినియోగం పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.