రాజకీయాలపై శోభిత ధూళిపాళ సంచలన వ్యాఖ్యలు

Sobhita Dhulipala sensational comments on politics
  • తనకు వామపక్ష భావజాలం చాలా ఎక్కువన్న శోభిత
  • భవిష్యత్తులో కమ్యూనిజమే విజయం సాధిస్తుందని వ్యాఖ్య
  • గ్లామర్ ప్రపంచంలో ఉంటూ కమ్యూనిజం గురించి మాట్లాడటం సరికాదంటున్న నెటిజన్లు

ప్రముఖ నటి, అక్కినేని నాగచైతన్య భార్య శోభితా ధూళిపాళ తన రాజకీయ భావజాలంపై చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా వ్యాప్తంగా విపరీతమైన చర్చకు దారితీస్తున్నాయి. "నాకు వామపక్ష భావజాలం చాలా ఎక్కువ. భవిష్యత్తులో ఏదో ఒక రోజు కమ్యూనిజమే కచ్చితంగా విజయం సాధిస్తుంది" అని ఆమె చెప్పిన మాటలు పెను దుమారమే రేపాయి.


గ్లామర్ ఇండస్ట్రీలో ఉంటూ, తమ కెరీర్ దెబ్బతింటుందనే భయంతో ఏ హీరోయిన్ కూడా పొలిటికల్ ఐడియాలజీని బయటకు చెప్పేందుకు ఇష్టపడరు. అలాంటిది శోభితా ధూళిపాళ ఎలాంటి దాపరికం లేకుండా, అత్యంత ధైర్యంగా తన మనసులోని అభిప్రాయాలను బయటపెట్టడంపై కొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. వ్యక్తిగత భావ ప్రకటన స్వేచ్ఛకు గౌరవం ఇస్తూ ఆమె నిజాయతీని కొనియాడుతున్నారు.


అయితే, మరికొందరు నెటిజన్లు మాత్రం ఆమె వ్యాఖ్యలపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. చిత్ర పరిశ్రమలో నటిగా ఉంటూ, అత్యంత విలాసవంతమైన లైఫ్‌స్టైల్‌ను గడుపుతున్న శోభిత... కమ్యూనిజం గురించి మాట్లాడటం సరికాదని కామెంట్స్ చేస్తున్నారు. నేటి ఆధునిక ప్రపంచంలో ఆమె చెప్తున్న సిద్ధాంతాలు ఆచరణాత్మకంగా ఎంతవరకు సాధ్యమని ప్రశ్నిస్తున్నారు.


ఇక సినిమాల విషయానికి వస్తే, నాగచైతన్యతో వివాహం తర్వాత కొంత విరామం తీసుకున్న శోభిత..జ 'చీకటిలో', 'క్రాస్ రోడ్స్' వంటి ప్రాజెక్టులతో అలరించారు. ప్రస్తుతం ఇవి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం 'సిల్ బట్టా', 'వెట్టువం' వంటి వినూత్న చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

Advertisement
Sobhita Dhulipala
Leftist Ideology
Naga Chaitanya Wife
Communism Comments
Telugu Actress Politics
Sobhita Dhulipala Upcoming Movies

More Telugu News