అజిత్ అగార్కర్ మార్పు తప్పదా? అతడి స్థానంలో మరో మాజీ స్టార్ ప్లేయర్!
- అజిత్ అగార్కర్ స్థానంపై అనిశ్చితి
- అతడి స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ వస్తాడని ప్రచారం
- రోహిత్ భవిష్యత్తు అంశం కీలకంగా మారిన వైనం
- లార్డ్స్ వన్డేలో రోహిత్ సెంచరీతో మారిన సమీకరణాలు
భారత క్రికెట్‌లో మరో కీలక మార్పుకు రంగం సిద్ధమవుతున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి. జట్టు ఎంపిక బాధ్యతలు చేపట్టిన అజిత్ అగార్కర్ భవితవ్యంపై సందిగ్ధత నెలకొంది. ఆయన స్థానంలో భారత మాజీ స్టార్ వీవీఎస్ లక్ష్మణ్‌ను తీసుకురావాలని బీసీసీఐ పెద్దలు ఆలోచిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. రోహిత్ శర్మ భవిష్యత్తు చుట్టూ జరిగిన పరిణామాలు కూడా ఈ చర్చకు బలం చేకూర్చినట్టు తెలుస్తోంది.
బీసీసీఐ ప్రధాన ఎంపిక కమిటీ ఛైర్మన్‌గా అజిత్ అగార్కర్ ఒప్పందం జూన్ 2026తో ముగిసింది. ఆ తర్వాత బోర్డు మూడు నెలల పొడిగింపు ఇచ్చింది. 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఆయన కొనసాగుతారనే ప్రచారం జరుగుతూ వచ్చింది. కానీ, ఇప్పుడు అనూహ్యంగా కొత్త ముఖాన్ని తీసుకురావాలనే ఆలోచన సాగుతున్నట్టు సమాచారం. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అధిపతి వీవీఎస్ లక్ష్మణ్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది.
ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్ రోహిత్ శర్మకు చివరిదని ముందుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాతి సిరీస్‌లకు అతణ్ని పక్కన పెట్టే అంశంపై అగార్కర్ నేతృత్వంలోని ఎంపిక కమిటీ, గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని జట్టు యాజమాన్యంతో చర్చించినట్టు కథనాలు వెలువడ్డాయి.
అయితే లార్డ్స్‌లో జరిగిన మూడో వన్డేకు ముందు అదే రోహిత్ చివరి మ్యాచ్ అవుతుందనే వార్త బయటకు వచ్చింది. ఆ మ్యాచ్‌లో రోహిత్ సెంచరీతో మెరవడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఎంపిక కమిటీపై ఒత్తిడి పెరిగినట్టు చెబుతున్నారు.
లార్డ్స్ వన్డే తర్వాత బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టమైన ప్రకటన చేశారు. రోహిత్ ఇంకా జట్టు ప్రణాళికల్లో భాగమేనని చెప్పారు. అతడు ఇంకా కొంత కాలం భారత జట్టుకు ఆడతాడని వెల్లడించారు. ఈ ప్రకటనకు ముందు అగార్కర్‌తో సంప్రదింపులు జరగలేదని కూడా వార్తలు వచ్చాయి.
ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో భారత్ పది మ్యాచ్‌ల్లో ఎనిమిది ఓటములు చవిచూసింది. ఈ ప్రదర్శనపై సమీక్ష సమావేశం నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఇంగ్లండ్ పర్యటన తర్వాత సమావేశం జరగాల్సి ఉన్నా ఇప్పటికీ నిర్వహించలేదు. ఇప్పటికే భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లిపోయింది. దీంతో ఆ సమావేశం ఎప్పుడు జరుగుతుందనే ఆసక్తి నెలకొంది.