త్రిష పై ఉదయనిధి వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన చిన్మయి శ్రీపాద
- నటి త్రిషపై ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల పట్ల గాయని చిన్మయి ఆగ్రహం
- రాజకీయ నేతలు అసలు సమస్యలపై దృష్టి పెట్టాలని సూచన
- అది కేవలం మగవాళ్లకు మాత్రమే అర్థమయ్యే బూతు జోక్ అని విమర్శ
- గతంలో జయలలితను కూడా ఇలాగే అనేవారని గుర్తు చేసిన చిన్మయి
- యువతరం నేతల తీరు నిరాశపరిచిందని ఆవేదన
తమిళనాడు మాజీ మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్, నటి త్రిషను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద తీవ్రంగా స్పందించారు. రాజకీయాల్లో ఉన్న పురుషులు మహిళలను అనవసరంగా వివాదాల్లోకి లాగడం మానేసి, ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని ఆమె హితవు పలికారు.
ఈ వ్యవహారంపై చిన్మయి 'ఎక్స్' వేదికగా స్పందిస్తూ, "ఉదయనిధి చేసిన వ్యాఖ్యల అంతరార్థం మొదట నాకు అర్థం కాలేదు. ఎవరో వివరిస్తే గానీ అసలు విషయం బోధపడలేదు. చాలామంది మహిళలకు కూడా అది అర్థం కాలేదు. అది కేవలం మగవారికి మాత్రమే అర్థమయ్యే సంకేతం. తన ప్రసంగానికి అంతరాయం కలిగిస్తున్న ప్రేక్షకులను అదుపు చేయాల్సింది పోయి, ఆయన మరింత అభ్యంతరకరంగా మాట్లాడటం నిరాశ కలిగించింది" అని పేర్కొన్నారు.
గతంలో డీఎంకే నేత శివాజీ కృష్ణమూర్తి వంటి వారు రాజకీయ వేదికలపై మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడటానికి ఇటువంటి ప్రోత్సాహాలే కారణమని చిన్మయి ఆరోపించారు. "గతంలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత గురించి కూడా ఇదే తరహాలో నీచంగా మాట్లాడేవారు. పాత తరం నేతల పోకడలు ఎలా ఉన్నా, కనీసం యువ తరం నేతలైనా హుందాగా వ్యవహరిస్తారని ఆశిస్తాం. కానీ వారి ప్రవర్తన కూడా దారుణంగా ఉండటం తీవ్ర నిరాశకు గురిచేసింది" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరహా అంశాలపై మహిళలు తగినంతగా స్పందించడం లేదని చిన్మయి అభిప్రాయపడ్డారు.