వై-ఫై, టీవీ, ఓటీటీ ఒకే ప్యాక్‌లో.. జియో కొత్త ప్లాన్లు

Jio new plans offer Wi-Fi TV and OTT in a single pack
  • జియో కొత్త 3-ఇన్-1 ప్లాన్లు ప్రారంభం.
  • రూ.2,122 నుంచి 3-ఇన్-1 ప్లాన్లు అందుబాటులోకి
  • 100 Mbps, 30 Mbps బ్రాడ్‌బ్యాండ్ ఎంపికలు
  • 1,000కుపైగా టీవీ ఛానళ్లు, 12 ఓటీటీలు
  • టీవీ-ఓన్లీ, వై-ఫై-ఓన్లీ ప్లాన్లు కూడా విడుదల
  • ప్లాన్ల ధరలు రూ.1,000 నుంచి ప్రారంభం
జియో హోమ్ తన వినియోగదారుల కోసం కొత్త 3-ఇన్-1 సర్వీస్ ప్యాక్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒకే ప్లాన్‌లో బ్రాడ్‌బ్యాండ్ వై-ఫై, 1,000కుపైగా లైవ్ టీవీ ఛానళ్లు, 12 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల సౌకర్యాన్ని కలిపి అందిస్తోంది. విడివిడిగా ప్లాన్లు తీసుకోవడంతో పోలిస్తే తక్కువ ఖర్చుతో ఈ సేవలు లభిస్తాయని సంస్థ తెలిపింది.

కొత్తగా రెండు 3-ఇన్-1 ప్లాన్లను ప్రవేశపెట్టింది. 2+1 నెలల ప్లాన్ ధర రూ.2,122. ఇందులో నెలకు రూ.707 చొప్పున 100 Mbps బ్రాడ్‌బ్యాండ్ వేగంతో పాటు 1,000కుపైగా లైవ్ టీవీ ఛానళ్లు, 12 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల యాక్సెస్ లభిస్తుంది.

3+1 నెలల ప్లాన్ ధర రూ.2,222. ఇందులో నెలకు రూ.555 చొప్పున 30 Mbps బ్రాడ్‌బ్యాండ్ వేగం, 1,000కుపైగా లైవ్ టీవీ ఛానళ్లు, 12 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల సౌకర్యం ఉంటుంది.

జియో కొత్తగా టీవీ-ఓన్లీ ప్లాన్లను కూడా ప్రకటించింది. ఐదు నెలల ప్లాన్ ధర రూ.2,000. నెలకు రూ.400 చొప్పున 1,000కుపైగా లైవ్ టీవీ ఛానళ్లు, 200కుపైగా హెచ్‌డీ ఛానళ్లు, 15కుపైగా ప్రాంతీయ భాషల కంటెంట్ అందుబాటులో ఉంటుంది. ఇదే ప్లాన్ రెండు నెలల కాలపరిమితితో రూ.1,000కు కూడా లభిస్తుంది. ఈ ప్లాన్లకు రూ.200 సెటప్ ఫీజు చెల్లించాలి.

అలాగే వై-ఫై-ఓన్లీ ప్లాన్లను కూడా జియో అందుబాటులోకి తెచ్చింది. 100 Mbps వేగంతో ఐదు నెలల ప్లాన్ ధర రూ.3,000. నెలకు రూ.600 చొప్పున ఉంటుంది. రెండు నెలల ప్లాన్ ధర రూ.1,500. దీనికి రూ.300 సెటప్ ఫీజు ఉంటుంది.

30 Mbps వేగంతో ఐదు నెలల ప్లాన్ ధర రూ.2,200. నెలకు రూ.450 చొప్పున ఖర్చవుతుంది. రెండు నెలల ప్లాన్ రూ.1,100కు లభిస్తుంది.
Advertisement
Jio
Jio 3 in 1 plans
Jio Fiber broadband
Jio OTT plans
Jio TV channel packs
Jio Home Wi-Fi offers

More Telugu News