గుజరాత్‌లో చండీపుర వైరస్‌తో 22 మంది మృతి.. ఏంటీ మహమ్మారి?
- శాండ్‌ఫ్లై కాటు ద్వారా వైరస్ వ్యాప్తి
- 15 ఏళ్లలోపు పిల్లలకు ఎక్కువ ప్రమాదం
- జ్వరం తర్వాత మెదడుపై దాడి చేసే అవకాశం
- టీకా, ప్రత్యేక మందు ప్రస్తుతం లేవు
- లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి
- కీటకాల నుంచి రక్షణే ప్రధాన నివారణ
గుజరాత్‌లో చండీపుర వైరస్ మరోసారి కలకలం రేపుతోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటివరకు 22 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో 35 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. సాధారణ జ్వరంలా మొదలయ్యే ఈ ఇన్‌ఫెక్షన్ కొన్ని గంటల్లోనే మెదడుపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉండటంతో వైద్యులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అసలు చండీపుర వైరస్ అంటే ఏంటి? ఇది ఎలా వ్యాపిస్తుంది? లక్షణాలు ఏంటి? చికిత్స ఉందా? తెలుసుకుందాం..
ఏంటీ వైరస్?
రాబ్డోవిరిడే కుటుంబానికి చెందినదే ఈ చండీపుర వైరస్ (సీహెచ్‌పీవీ). దీన్ని తొలిసారి 1965లో భారత్‌లో గుర్తించారు. వర్షాకాలంలో ఎక్కువగా కనిపించే శాండ్‌ఫ్లై (ఇసుక ఈగ) వల్ల ఇది వ్యాపిస్తుంది. మనుషుల నుంచి మనుషులకు ఈ వైరస్ సోకినట్లు ఇప్పటివరకు ఆధారాలు లేవు.
ఎవరికి ఎక్కువ ప్రమాదం?
ఈ వైరస్ ఎక్కువగా 15 ఏళ్లలోపు చిన్నారులపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, శాండ్‌ఫ్లైలు ఎక్కువగా ఉండే చోట్ల ప్రమాదం అధికంగా ఉంటుంది. వర్షాకాలంలో ఈగల సంఖ్య పెరగడంతో వైరస్ వ్యాప్తి కూడా ఎక్కువగా కనిపిస్తుంది.
మొదట కనిపించే లక్షణాలు ఏవి?
ప్రారంభంలో ఈ వైరస్‌ను గుర్తించడం కాస్త కష్టం. ఎందుకంటే మొదట సాధారణ వైరల్ జ్వరంలాగే కనిపిస్తుంది. జ్వరం, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, నీరసం, ఫ్లూ లక్షణాలు ఉంటాయి. ఈ దశలో చాలామంది సాధారణ జ్వరంగా భావించే అవకాశం ఉంటుంది.
ఎందుకు ప్రమాదకరం?
కొంతమంది చిన్నారుల్లో వైరస్ చాలా వేగంగా మెదడుపై దాడి చేస్తుంది. దీంతో మెదడు వాపు (ఎన్‌సెఫలైటిస్) వస్తుంది. ఆ తర్వాత పరిస్థితి గంటల వ్యవధిలోనే విషమించవచ్చు.
తీవ్రమైన లక్షణాలు ఇవీ..
మూర్ఛ, స్పృహ కోల్పోవడం, కోమాలోకి వెళ్లడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందుల వంటి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని కేసుల్లో ఆసుపత్రిలో చేరిన 48 నుంచి 72 గంటల్లోనే ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
చికిత్స ఉందా?
ప్రస్తుతం చండీపుర వైరస్‌కు ప్రత్యేకంగా పనిచేసే మందు లేదు. టీకా కూడా అందుబాటులో లేదు. రోగికి కనిపించే లక్షణాలను బట్టి చికిత్స అందిస్తారు. శ్వాస, రక్తపోటు వంటి కీలక అవయవాల పనితీరును నిలకడగా ఉంచే ప్రయత్నం చేస్తారు. అందుకే లక్షణాలు కనిపించగానే ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి తీసుకెళ్లడం కీలకం.
ఎలా జాగ్రత్త పడాలి?
చండీపుర వైరస్‌కు ప్రత్యేక టీకా లేకపోవడంతో నివారణే ఉత్తమ మార్గం. శాండ్‌ఫ్లై కాటుకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలకు పూర్తి చేతులు కవర్ అయ్యేలా దుస్తులు వేయాలి. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కీటకనాశక ద్రావణాలు, దోమతెరలు ఉపయోగించాలి. జ్వరం, వాంతులు, మూర్ఛలు కనిపిస్తే వెంటనే వైద్యుణ్ని సంప్రదించాలి.
ఎందుకు అప్రమత్తంగా ఉండాలి?
చండీపుర వైరస్ చాలా అరుదుగా కనిపించినా, ఒకసారి సోకితే వేగంగా తీవ్ర స్థితికి చేరుకునే ప్రమాదం ఉంది. అందుకే పిల్లల్లో సాధారణ జ్వరంతో పాటు నాడీ సంబంధిత లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య పరీక్షలు చేయించాలని నిపుణులు సూచిస్తున్నారు.