బాస్‌తో మీరు ఎంత క్లోజ్ అయినా సరే.. ఈ విషయాలు మాత్రం అస్సలు చెప్పొద్దు!
- బాస్‌తో స్నేహం ఉన్నా హద్దులు అవసరం
- జీతం కోసమే చేస్తున్నానని చెప్పొద్దు
- వ్యక్తిగత సమస్యలు అతిగా పంచుకోవద్దు
- ఉద్యోగ మార్పు ప్రయత్నాలు గోప్యంగా ఉంచాలి
- గాసిప్, "అది నా పని కాదు" వంటి మాటలకు దూరంగా ఉండాలి
ఆఫీసులో బాస్‌తో మంచి అనుబంధం ఉంటే ఉద్యోగ జీవితం సాఫీగా సాగుతుంది. సరదాగా మాట్లాడటం, వ్యక్తిగత విషయాలు అడగడం, టీ బ్రేక్‌లో కలిసి కూర్చోవడం సహజమే. అయితే ఆ సాన్నిహిత్యాన్ని స్నేహంగా భావించి కొన్ని విషయాలు చెప్పేస్తే తర్వాత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే బాస్ చివరకు మీ పనితీరును అంచనా వేసే వ్యక్తి అని మర్చిపోవద్దు. అందుకే ఎంత సన్నిహితంగా ఉన్నా కొన్ని విషయాలు చెప్పకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
డబ్బు కోసమే ఈ ఉద్యోగం చేస్తున్నా
జీతం కోసం ఉద్యోగం చేయడం తప్పేమీ కాదు. దాదాపు ప్రతి ఒక్కరి పరిస్థితి అదే. కానీ ఈ విషయాన్ని బాస్‌కు నేరుగా చెప్పడం వల్ల పనిపై మీకు ఆసక్తి లేదనే అభిప్రాయం కలిగే ప్రమాదం ఉంది. ఉద్యోగం ద్వారా నేర్చుకుంటున్న నైపుణ్యాలు, అనుభవం గురించి మాట్లాడటం మెరుగైన ముద్ర వేస్తుంది.
ఇంట్లో జరిగే ప్రతి సమస్య చెప్పొద్దు
కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత ఒత్తిడి వల్ల పనిపై ప్రభావం పడితే బాస్‌కు సంక్షిప్తంగా చెప్పడం సరైనదే. కానీ ప్రతి చిన్న విషయాన్ని వివరంగా చెప్పడం వృత్తిపరమైన హద్దులను దాటినట్లే అవుతుంది. అవసరమైనంత సమాచారం మాత్రమే పంచుకోవడం మంచిది.
మరో కంపెనీలో ఇంటర్వ్యూలు ఇస్తున్నా
కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించడం వ్యక్తిగత నిర్ణయం. కానీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోకముందే బాస్‌కు చెప్పడం వల్ల ప్రతికూల ప్రభావం పడొచ్చు. మీరు వెళ్లిపోతారనే భావనతో సంస్థ ముందుగానే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ప్రారంభించే అవకాశం ఉంటుంది. కొత్త ఆఫర్‌ను ఖరారు చేసుకున్న తర్వాతే అధికారికంగా రాజీనామా గురించి మాట్లాడటం ఉత్తమం.
అది నా పని కాదు
కొన్ని పనులు నిజంగానే మీ బాధ్యత కాకపోవచ్చు. అయినా ‘అది నా పని కాదు’ అని చెప్పడం సహకరించే స్వభావం లేదనే భావన కలిగిస్తుంది. దానికి బదులుగా ‘ప్రస్తుతం ఈ పనుల్లో బిజీగా ఉన్నాను. వీటిలో దేనికి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది?’ అని మర్యాదపూర్వకంగా అడిగితే అదే విషయాన్ని మరింత హుందాగా చెప్పినట్లవుతుంది.
గాసిప్‌లు చెప్పొద్దు
ప్రతి ఆఫీసులో పుకార్లు సహజమే. ప్రమోషన్లు, రాజీనామాలు, కొత్త నియామకాలపై ఎన్నో ఊహాగానాలు వినిపిస్తుంటాయి. నిర్ధారణ లేని సమాచారాన్ని బాస్‌తో పంచుకోవడం మీ విశ్వసనీయతను దెబ్బతీయొచ్చు. నిజం కాని సమాచారం చెప్పడం కంటే మౌనం పాటించడమే మంచిది.
వృత్తిపరమైన సంబంధాల్లో స్నేహపూర్వక వాతావరణం ఉండటం మంచిదే. కానీ బాస్ చివరకు మీ పనితీరు, పదోన్నతులు, భవిష్యత్తు అవకాశాలపై నిర్ణయాలు తీసుకునే వ్యక్తి అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రతి ఆలోచనను చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఏది చెప్పాలి.. ఏది చెప్పకూడదు అన్న విచక్షణే మంచి కెరీర్‌కు బలమైన పునాది అవుతుంది.