పిల్లలపై అరిచారా?.. ఒక్క ‘సారీ’తో చాలా మారిపోతుంది!
- పిల్లలపై అరిచినా ‘సారీ’ చెప్పాలి
- క్షమాపణ బంధాన్ని బలపరుస్తుంది
- తల్లిదండ్రుల ప్రవర్తన నుంచే పిల్లలు ఎక్కువగా నేర్చుకుంటారు
- క్రమశిక్షణకు, కోపానికి తేడా చెప్పాలి
- దాంతోనే భావోద్వేగ వికాసానికి తోడ్పాటు
పిల్లల పెంపకం అనేది ప్రతి తల్లిదండ్రికీ ఓ సవాల్. ఉద్యోగ ఒత్తిడి, నిద్రలేమి, ఇంటి బాధ్యతలు.. ఇలాంటి కారణాలతో ఒక్కోసారి పిల్లలపై కోపం రావడం సహజమే. ఆవేశంలో గట్టిగా మాట్లాడటం, అరిచేయడం కూడా చాలామందికి జరుగుతుంది. అయితే అసలు విషయం అక్కడితో ముగియదని మానసిక నిపుణులు చెబుతున్నారు. కోపం తగ్గిన తర్వాత పిల్లలకు మనస్ఫూర్తిగా ‘సారీ’ చెప్పడం వారి మనసులో భద్రత, నమ్మకాన్ని మరింత పెంచుతుందని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి.
పెద్దలు చెప్పే మాటల కంటే.. వాళ్లు చేసినదాన్నే పిల్లలు ఎక్కువగా గమనిస్తారు. అందుకే తల్లిదండ్రులు తమ తప్పును అంగీకరించి క్షమాపణ చెప్పడం ద్వారా బాధ్యత తీసుకోవడం ఎలా ఉంటుందో పిల్లలు నేర్చుకుంటారని నిపుణులు వివరిస్తున్నారు. అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ ప్రకారం పిల్లలు తమకు దగ్గరైన పెద్దల ప్రవర్తనను అనుకరిస్తూ సామాజిక, భావోద్వేగ నైపుణ్యాలను పెంపొందించుకుంటారు. ఇంట్లో సమస్యలను గౌరవంగా పరిష్కరించడం చూస్తే.. భవిష్యత్తులో వారు కూడా అదే మార్గాన్ని అనుసరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
చిన్న పిల్లలకు తల్లిదండ్రుల కోపం చాలా భయాన్ని కలిగించవచ్చు. ఎందుకు అరిచారో అర్థం కాక అయోమయానికి గురవుతారు. అలాంటి సమయంలో క్షమాపణ చెప్పడం వల్ల దెబ్బతిన్న భావోద్వేగ అనుబంధం మళ్లీ బలపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతి కుటుంబంలో గొడవలు సహజం. కానీ తర్వాత మళ్లీ ప్రేమతో దగ్గరవడమే బలమైన బంధానికి పునాది. పిల్లలకు పరిపూర్ణ తల్లిదండ్రులు అవసరం లేదని, తప్పు జరిగినప్పుడు దాన్ని సరిదిద్దే తల్లిదండ్రులే అవసరమని ఆమె చెబుతున్నారు.
‘సారీ’ చెప్పడం వల్ల పిల్లలు మాట వినరని చాలామంది భావిస్తారు. కానీ అది నిజం కాదని మానసిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. క్రమశిక్షణ ఒకటి.. కోపంతో నియంత్రణ కోల్పోవడం మరోటి అని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలని సూచిస్తున్నారు. ఉదాహరణకు.. ‘నువ్వు చేసిన పని తప్పే. కానీ నేను అలా అరిచేయకూడదు. అందుకు క్షమించు’ అని చెప్పడం సరైన విధానమని వివరిస్తున్నారు.
హార్వర్డ్ విశ్వవిద్యాలయం ‘సెంటర్ ఆన్ ది డెవలపింగ్ చైల్డ్’ వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రేమతో స్పందించే కుటుంబ వాతావరణంలో పెరిగిన పిల్లలు ఒత్తిడిని మెరుగ్గా ఎదుర్కొంటారు. భావోద్వేగాలను అర్థం చేసుకోవడం, ఇతరుల పట్ల సానుభూతి చూపించడం, తమ కోపాన్ని నియంత్రించుకోవడం వంటి లక్షణాలు కూడా ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి. తల్లిదండ్రులు తమ భావాలను స్పష్టంగా వ్యక్తం చేస్తే.. పిల్లలు కూడా తమ భావోద్వేగాలను గుర్తించడం నేర్చుకుంటారని నిపుణులు చెబుతున్నారు.
క్షమాపణ కూడా సరైన విధంగా ఉండాలని సైకాలజిస్టులు సూచిస్తున్నారు. ఏం జరిగిందో స్పష్టంగా చెప్పాలి. చేసిన తప్పునకు బాధ్యత వహించాలి. ఇకపై అలాంటి పరిస్థితిని ఎలా ఎదుర్కొంటామో వివరించాలి. అలాగే పిల్లల భావాలను కూడా ఓపిగ్గా వినాలి. ఇలా చేస్తే తల్లిదండ్రులు-పిల్లల మధ్య నమ్మకం మరింత బలపడుతుంది.