జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడిపై ఇంక్ లాంటి ద్రవం చల్లిన మహిళ

Tension at Jantar Mantar as woman throws ink on Cockroach Party founder
  • సోనమ్ వాంగ్‌చుక్‌ను ఆసుపత్రికి తరలించడంతో ఆందోళన ఉద్రిక్తం
  • కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ డిప్కే ఆమరణ నిరాహార దీక్ష
  • ప్రసంగిస్తున్న సమయంలో డిప్కేపై గుర్తుతెలియని మహిళ ఇంకు దాడి
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శనివారం నిరసనలు మరింత ఉద్రిక్తంగా మారాయి. గత 21 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్‌ను పోలీసులు ఆసుపత్రికి తరలించిన కొద్ది గంటలకే, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. వాంగ్‌చుక్‌ను పోలీసులు బలవంతంగా, అనుచిత రీతిలో తరలించారని ఆరోపిస్తూ అభిజీత్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

శనివారం తెల్లవారుజామున వాంగ్‌చుక్‌ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, వైద్య నిపుణుల సలహా మేరకు పోలీసులు ఆయన్ను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. అయితే, నిరసనకారులు అప్రమత్తంగా లేని సమయంలో పోలీసులు వాంగ్‌చుక్‌ను బలవంతంగా తీసుకెళ్లారని సీజేపీ ఆరోపించింది. ఈ క్రమంలో తనకు కూడా గాయాలయ్యాయని అభిజీత్ పేర్కొన్నారు. అనంతరం మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, తాను ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.

అభిజీత్ వేదికపై ప్రసంగిస్తున్న సమయంలో ఒక గుర్తుతెలియని మహిళ ఆయనపై సిరా వంటి ద్రవాన్ని విసిరింది. దీంతో అక్కడ ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. వెంటనే స్పందించిన పోలీసులు సదరు మహిళను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఎన్ని దాడులు జరిగినా తాము భయపడబోమని, తామంతా బాబాసాహెబ్ బిడ్డలమని సీజేపీ సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేసింది.

నీట్-యూజీ పేపర్ లీక్ కుంభకోణానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, జూన్ 20 నుంచి సీజేపీ జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
Advertisement
Abhijit Dipke
Cockroach Janata Party
Jantar Mantar protest
Sonam Wangchuk
NEET-UG paper leak

More Telugu News