హైదరాబాద్ కేబీఆర్ పార్కులో భారీ కొండచిలువ... వీడియో ఇదిగో!
- కేబీఆర్ పార్క్‌లో 20 అడుగుల కొండచిలువ ప్రత్యక్షం
- వాకింగ్ ట్రాక్ దాటుతుండగా చూసి ఆశ్చర్యపోయిన వాకర్లు
- సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన కొండచిలువ వీడియో
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్‌లో శనివారం ఉదయం ఓ భారీ కొండచిలువ ప్రత్యక్షమవ్వడం కలకలం రేపింది. సుమారు 20 అడుగుల పొడవున్న ఈ 'ఇండియన్ రాక్ పైథన్' పార్క్‌లోని వాకింగ్ ట్రాక్‌ను నెమ్మదిగా దాటుతుండగా చూసిన మార్నింగ్ వాకర్లు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. కొందరు ఈ దృశ్యాన్ని తమ ఫోన్లలో చిత్రీకరించగా, ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ ఘటనతో వాకర్లు కొద్దిసేపు నిలిచిపోయి, సురక్షిత దూరం నుంచి ఆ కొండచిలువను గమనించారు. అయితే, ఎవరికీ ఎటువంటి హాని తలపెట్టకుండా అది నెమ్మదిగా సమీపంలోని పొదల్లోకి వెళ్లిపోయింది. కాగా, వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972లోని షెడ్యూల్-1 ప్రకారం 'ఇండియన్ రాక్ పైథన్' అత్యంత రక్షిత జాతుల జాబితాలో ఉంది.
ఇటీవల హైదరాబాద్ నగరంలో పాముల సంచారం గణనీయంగా పెరిగిందని, వాతావరణ మార్పుల కారణంగానే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని 'ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్' వంటి స్వచ్ఛంద సంస్థలు పేర్కొంటున్నాయి. వన్యప్రాణులు ఎక్కడైనా కనిపిస్తే వాటికి దూరంగా ఉండాలని, వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.