సోనమ్ వాంగ్‌చుక్ ట్రీట్‌మెంట్ తీసుకోవడం లేదు: వైద్యులు
- వాంగ్‌చుక్‌ను ఆసుపత్రికి తరలించిన పోలీసులు
- ఐవీ ఫ్లూయిడ్స్, మందులకు నిరాకరణ
- నీరసం.. శరీరంలో నీటి శాతం తగ్గిన లక్షణాలున్నాయని వెల్లడి
- అనుమతి లేకుండా చికిత్స చేయొద్దన్న భార్య
సామాజిక ఉద్యమకారుడు, విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ (59) చికిత్స తీసుకోవడానికి నిరాకరిస్తున్నారని వైద్యులు తెలిపారు. 20 రోజులుగా నిరాహార దీక్ష చేయడం వల్ల ఆయన చాలా బలహీనంగా తయారయ్యారని వెల్లడించారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ నిరాహార దీక్ష చేస్తున్న వాంగ్‌చుక్‌ను ఢిల్లీ పోలీసులు ఈరోజు ఉదయం సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే.
ఆసుపత్రికి ఉదయం 7.40 గంటలకు వాంగ్‌చుక్‌ను తీసుకొచ్చారని బులెటిన్‌లో తెలిపింది. 20 రోజులుగా ఘనాహారం తీసుకోకపోవడం వల్ల ఆయన తీవ్ర నీరసంతో ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. ఆసుపత్రిలో చేర్చిన సమయంలో ఆయనకు స్పృహ ఉందని, పల్స్, రక్తపోటు, ఆక్సిజన్ స్థాయులు నిలకడగా ఉన్నాయని పేర్కొన్నారు. అయితే శరీరంలో నీటి శాతం తగ్గిన లక్షణాలు (డీహైడ్రేషన్) కనిపించాయని వెల్లడించారు.
వైద్యులు ఇంట్రావీనస్ ఫ్లూయిడ్స్ (ఐవీ ద్రవాలు), ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్‌తో పాటు అవసరమైన మందులు తీసుకోవాలని సూచించారు. కానీ వాటన్నింటినీ వాంగ్‌చుక్ తిరస్కరించినట్టు ఆసుపత్రి తెలిపింది. ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ చికిత్స తీసుకోవాలని వైద్యులు కౌన్సెలింగ్ చేస్తున్నట్టు వెల్లడించింది.
ఆసుపత్రిలో చేర్చిన కొద్దిసేపటికే వాంగ్‌చుక్ భార్య గీతాంజలి జే ఆంగ్మో స్పందించారు. తన అనుమతి లేకుండా ఎలాంటి చికిత్స చేయొద్దని కోరారు. వైద్య చికిత్స విషయంలో పారదర్శకత లేదని ఆరోపిస్తూ ఆయనను డిశ్ఛార్జ్ చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఆసుపత్రిలోనూ ఆయన దీక్ష కొనసాగిస్తున్నారని తెలిపారు.