హైదరాబాదులో పవన్ కల్యాణ్ ను పరామర్శించిన నారా లోకేశ్.. ఫొటోలు ఇవిగో!
- గతంలో పవన్ భుజానికి గాయం
- ఇటీవల ముంబైలో విజయవంతంగా శస్త్రచికిత్స
- కొన్ని రోజుల కిందటే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి
- హైదరాబాదులోని నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న వైనం
- పవనన్న త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన లోకేశ్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శనివారం పరామర్శించారు. ఇటీవల ముంబయిలో భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కల్యాణ్‌ను లోకేశ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా "పవనన్న త్వరగా కోలుకోవాలి" అని ఆయన ఆకాంక్షించారు.
పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిని లోకేశ్ అడిగి తెలుసుకున్నారు. భుజానికి అయిన గాయం, జరిగిన శస్త్రచికిత్స వివరాలను అడిగారు. వైద్యుల సూచనల మేరకు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. తన పరామర్శ అనంతరం లోకేశ్ మాట్లాడుతూ.. "డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారిని పరామర్శించాను. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాను. వైద్యుల సూచనలు పాటిస్తూ వీలైనంత మేర విశ్రాంతి తీసుకోవాలని సూచించాను" అని తెలిపారు.
గతంలో భుజానికి గాయం కావడంతో పవన్ కల్యాణ్ కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ముంబయిలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో ఆయన కుడి భుజానికి వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఆయన హైదరాబాద్‌లోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. పలువురు ప్రముఖులు ఆయన నివాసానికి వచ్చి పరామర్శిస్తున్నారు.