బహదూర్‌గూడలో మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై కారం చల్లిన రైతులు

Tension in Bahadurguda again as farmers throw chili powder on police
  • బహదూర్‌గూడలో భూసేకరణపై ఘర్షణ
  • పోలీసులపై కారం చల్లి దాడి చేసిన రైతులు
  • కానిస్టేబుళ్లు సహా పలువు పోలీసులకు గాయాలు
  • 600 ఎకరాల భూముల స్వాధీనానికి వ్యతిరేకత
  • ఐదు రోజులుగా రైతుల ఆందోళన కొనసాగింపు
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం బహదూర్‌గూడలో బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు కోసం భూసేకరణ వ్యవహారం మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. భూములు స్వాధీనం చేసుకునేందుకు అధికారులు వెళ్లగా రైతులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆగ్రహానికి గురైన కొందరు రైతులు పోలీసులపై కారం చల్లి, రాళ్లు, కుర్చీలు విసురుతూ దాడికి దిగారు.

ఈ ఘటనలో పలువురు కానిస్టేబుళ్లు, ఎస్‌ఐలు, సీఐలకు గాయాలయ్యాయి. గాయపడిన అధికారులకు చికిత్స అందించారు. డీసీపీకి కూడా గాయాలైనట్టు తెలుస్తోంది. ఈ ఘటటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు కోసం సుమారు 600 ఎకరాల భూమిని సేకరించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. అయితే తమ భూములను ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వబోమంటూ రైతులు ఐదు రోజులుగా నిరసన కొనసాగిస్తున్నారు. తమకు స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతే భూసేకరణ చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు.

భూముల స్వాధీన ప్రక్రియ కోసం శనివారం ఉదయం హైడ్రా అధికారులు భారీ బందోబస్తుతో అక్కడికి చేరుకున్నారు. అధికారులు ముందుకు సాగేందుకు ప్రయత్నించగా రైతులు అడ్డుకున్నారు. ఉదయం మొదలైన ఉద్రిక్తత సాయంత్రానికి మరింత తీవ్రరూపం దాల్చింది.

పరిస్థితి చేదాటడంతో డీసీపీ యోగేశ్‌ గౌతమ్‌ రంగంలోకి దిగారు. వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇది ఆరంభం మాత్రమేనని, చర్చలు జరిపిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా కలెక్టర్‌కు విన్నవించుకునే అవకాశం కల్పిస్తారని చెప్పారు. రైతుల అనుమతి లేకుండా ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోబోరని హామీ ఇచ్చారు. అయినప్పటికీ.. రైతులు వెనక్కి తగ్గలేదు. నిరసన కొనసాగిస్తామని భీష్మించారు. 
Advertisement
Bahadurguda Farmers
Bullet Train Project
Shamshabad Land Acquisition
Rangareddy District Tension
HYDRA Officials
DCP Yogesh Gautam

More Telugu News