బాలీవుడ్ బాద్‌షా రియల్ లైఫ్ లవ్ స్టోరీ: గౌరీ కుటుంబాన్ని ఒప్పించడానికి షారుఖ్ మార్చిన పేర్లు ఇవే!

Bollywood Badshah Real Life Love Story The Names Shah Rukh Changed to Convince Gauri Family
  • షారుఖ్, గౌరీల పెళ్లి అంత సులభంగా ఏమీ జరగలేదు
  • తన పేరును జితేందర్ కుమార్ తుల్లీ, అభినవ్ గా మార్చుకున్న షారుఖ్
  • ముస్లిం సంప్రదాయ పెళ్లిలో తన పేరును ఆయేషాగా మార్చుకున్న గౌరీ

బాలీవుడ్ ఐకానిక్ కపుల్ షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్‌ల వైవాహిక బంధానికి చిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. అయితే, వెండితెరపై ఎన్నో ప్రేమ చిత్రాల్లో నటించిన షారుఖ్‌కు... నిజ జీవితంలో గౌరీ చేతిని అందుకోవడం అంత సులువుగా ఏమీ సాగలేదు. విభిన్న మత నేపథ్యాల వల్ల వీరి పెళ్లికి గౌరీ కుటుంబ సభ్యుల నుంచి తొలినాళ్లలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ సమయంలో వారిని ఒప్పించి, మెప్పించడానికి షారుఖ్ ఖాన్ ఏకంగా తన పేరును మార్చుకోవాల్సి వచ్చింది.


ముస్తాక్ షేక్ రాసిన "షారుఖ్ కాన్ (కెన్)" (Shah Rukh Can) అనే పుస్తకంలో ఈ ఆసక్తికరమైన విషయాలను ప్రస్తావించారు. గౌరీ కుటుంబ సభ్యుల ఆమోదం కోసం షారుఖ్ ఖాన్ తన పేరును 'జితేందర్ కుమార్ తుల్లీ'గా మార్చుకున్నారు. అప్పటి సీనియర్ నటులు జితేంద్ర, రాజేంద్ర కుమార్ (ఆయన పూర్తి పేరు రాజేంద్ర కుమార్ తుల్లీ)ల పేర్లు కలిసి వచ్చేలా షారుఖ్ ఈ పేరును ఎంచుకున్నారు. 


కేవలం మతాంతర వివాహమే కాకుండా, సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న యువకుడు కావడంతో గౌరీ తల్లిదండ్రులు మరింత ఆందోళన చెందారు. వారిని శాంతింపజేయడానికి షారుఖ్ తన పేరును 'అభినవ్'గా కూడా మార్చుకుని, తాను హిందూ అబ్బాయినే అని నమ్మించే ప్రయత్నం చేశారు. దీనిపై గౌరీ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ... "అప్పుడు మేం చాలా చిన్నవాళ్లం, ఆ నిర్ణయం చాలా సిల్లీగా, చిన్నపిల్లల తరహాలో అనిపిస్తుంది" అని నవ్వుతూ పాత జ్ఞాపకాలను పంచుకున్నారు.


అన్ని అడ్డంకులను దాటుకుని ఈ జంట 1991 అక్టోబర్ 25న వివాహ బంధంతో ఒకటయ్యారు. పెళ్లి సమయంలో గౌరీ వయసు 21 ఏళ్లు కాగా, షారుఖ్‌కు 26 ఏళ్లు. ఇరు కుటుంబాల సంప్రదాయాలను గౌరవిస్తూ వీరు హిందూ, ముస్లిం పద్ధతుల్లో పెళ్లి చేసుకున్నారు. నికాహ్ (ముస్లిం వివాహం) కోసం గౌరీ తన పేరును ‘ఆయేషా’గా మార్చుకోగా, హిందూ వివాహ పద్ధతి కోసం షారుఖ్ హిందూ పేరును తీసుకున్నారు. ఈ విషయాన్ని తాము చాలా మందికి చెప్పలేదని షారుఖ్ ఆ పుస్తకంలో పేర్కొన్నారు.

"మా ఇంట్లో దీపావళి వస్తే నేను పూజ చేస్తాను. కుటుంబ సభ్యులంతా నన్ను అనుసరిస్తారు. అదే ఈద్ పండగ వస్తే షారుఖ్ ముందుంటారు, మేమంతా ఫాలో అవుతాం. మా పిల్లలు ఆర్యన్, సుహానా, అబ్‌రామ్‌లు ఈ రెండు సంప్రదాయాలను ఎంతో అందంగా స్వీకరించారు. వారికి దీపావళి, రంజాన్.. పండుగ ఏదైనా సరే పండుగే" అని గౌరీ ఖాన్ సగర్వంగా చెప్పుకొచ్చారు.

Advertisement
Shah Rukh Khan
Gauri Khan
Jitender Kumar Tulli
Shah Rukh Khan love story
Bollywood interfaith marriages
Shah Rukh Khan Gauri marriage

More Telugu News