చిరంజీవికి పెళ్లికార్డు అందించిన బండ్ల గణేశ్... ఫొటోలు ఇవిగో!
- కుమార్తె జనని వివాహానికి మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించిన బండ్ల గణేశ్
- చిరంజీవి తనకు అన్నయ్య లాంటి వారని బండ్ల గణేశ్ భావోద్వేగ ట్వీట్
- ఆగస్టు 16న హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో జనని వివాహం
ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేశ్ తన కుమార్తె జనని వివాహ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి దంపతులను సాదరంగా ఆహ్వానించారు. శనివారం చిరంజీవి నివాసానికి తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిన బండ్ల గణేశ్, ఆగస్టు 16న జరగనున్న వివాహ వేడుకకు హాజరు కావాలని కోరుతూ చిరంజీవి, సురేఖ దంపతులకు వివాహ పత్రికను అందజేశారు.
ఈ సందర్భంగా బండ్ల గణేశ్ సామాజిక మాధ్యమాల వేదికగా హర్షం వ్యక్తం చేస్తూ ఒక పోస్ట్ చేశారు. "నేను చిత్ర పరిశ్రమలోకి రావడానికి స్ఫూర్తినిచ్చిన అన్నయ్య చిరంజీవి గారి ఆశీస్సులు లభించడం ఎంతో ఆనందంగా ఉంది" అని పేర్కొన్నారు. చిరంజీవితో దిగిన ఫొటోలను పంచుకుంటూ #JananiSuryaPayanam అనే హ్యాష్‌ట్యాగ్‌ను జతచేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బండ్ల గణేశ్ కుమార్తె జనని వివాహం, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సూర్యతేజ చిలుకూరితో జరగనుంది. ఆగస్టు 16న ఉదయం 11:58 గంటలకు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్‌లో ఈ పరిణయ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఇప్పటికే మే నెలలో జరిగిన నిశ్చితార్థం, పసుపు కుంకుమ కార్యక్రమాలకు చిరంజీవి, చంద్రబాబు సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.