తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పవన్ కల్యాణ్ అర్ధాంగి.. రూ. 17 లక్షల విరాళం
- నిన్న రాత్రి కాలినడకన తిరుమల చేరుకున్న అన్నా లెజినోవా
- ఈ ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్న లెజినోవా
- భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించిన పవన్ శ్రీమతి
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్న ఆమె, అలిపిరి నుంచి నడకమార్గంలో తిరుమల చేరుకున్నారు. నిన్న రాత్రి తిరుమల చేరుకున్న ఆమెకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఇటీవల పవన్ భుజానికి శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో ఆమె తిరుమల చేరుకుని మొక్కు తీర్చుకున్నారు. ఆమె తన కుమారుడు మార్క్ శంకర్ పేరుతో శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.17 లక్షలు విరాళం అందజేశారు. తిరుమలలో భక్తులకు అన్నప్రసాదం పంచారు. భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు.
అన్నా లెజినోవా రష్యా దేశానికి చెందినవారు. ఆమె పవన్ కల్యాణ్‌ను వివాహం చేసుకున్న తర్వాత హిందూ ఆచారాలను అనుసరిస్తున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఆమె సిందూరాన్ని ధరిస్తారు. మరోవైపు, పవన్ హైదరాబాద్ లోని తన నివాసంలో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈరోజు ఆయన అధ్యక్షతన జనసేన పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగబోతోంది.