‘నా అనుమతి లేకుండా చికిత్స వద్దు’.. సోనమ్ వాంగ్‌చుక్ భార్య విజ్ఞప్తి
- కుటుంబ సమ్మతి, వైద్యుల అంగీకారం లేకుండా వైద్యం వద్దన్న గీతాంజలి
- ఆరోగ్యం క్షీణించడంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించిన పోలీసులు
- హైకోర్టు ఆదేశాలతో చర్యలు తీసుకున్నామన్న పోలీసులు
- అడ్డుకున్న నిరసనకారులతో స్వల్ప ఉద్రిక్తత
- జులై 20న పార్లమెంట్ ముట్టడికి వాంగ్‌చుక్ పిలుపు
తన అనుమతి, కుటుంబ సభ్యుల సమ్మతి లేకుండా సోనమ్ వాంగ్‌చుక్‌కు ఎలాంటి చికిత్స చేయొద్దని ఆయన భార్య గీతాంజలి జె.అంగ్మో విజ్ఞప్తి చేశారు. గత 20 రోజులుగా ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్న వైద్యుల అంగీకారం లేకుండా నోటి ద్వారా గానీ, సిరల ద్వారా గానీ ఆయనకు ఎలాంటి చికిత్స అందించొద్దని ‘ఎక్స్’ వేదికగా కోరారు. 20 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న వాంగ్‌చుక్‌ను పోలీసులు శనివారం తెల్లవారుజామున ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే.
ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు, వైద్య నిపుణుల సూచన మేరకు వాంగ్‌చుక్‌ను ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఉదయం నిరసన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ సమయంలో తోటి ఆందోళనకారులు నినాదాలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేయడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. అయినా పోలీసులు అత్యంత సంయమనంతో చర్యలు చేపట్టినట్లు ఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ వెల్లడించారు. జంతర్‌మంతర్‌ను శాంతియుతంగా ఖాళీ చేయాలని నిరసనకారులకు విజ్ఞప్తి చేశారు.
వాంగ్‌చుక్ ఆరోగ్యంపై విచారణ జరపాల్సిన రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది. ఆయనకు రోజూ వైద్య పరీక్షలు నిర్వహించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ప్రతి పౌరుడి ప్రాణం విలువైనదేనని పేర్కొంటూ, అవసరమైన వైద్య సేవలు అందించాలని కేంద్రానికి సూచించింది.
నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలకు బాధ్యతవహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వాంగ్‌చుక్ ఈ నిరాహార దీక్ష చేపట్టారు. ఇదే డిమాండ్‌తో జులై 20న జంతర్‌మంతర్ నుంచి పార్లమెంట్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామని కూడా ప్రకటించారు.