ఈసారి కేబీసీలో కీలక మార్పు.. ప్రకటించిన అమితాబ్
- కేబీసీ-18కు ‘సోచ్‌నా పడేగా’ థీమ్
- సమాధానం కంటే ఆలోచనకే ప్రాధాన్యం
- ఆటలో మార్పులు ప్రకటించిన అమితాబ్
- ఏఐ ప్రభావాన్నే థీమ్‌గా తీసుకున్న షో
- ఆగస్టు 10 నుంచి కొత్త సీజన్
- కొత్త ప్రోమోలు విడుదల చేసిన సోనీ
‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ (కేబీసీ) కొత్త సీజన్‌లో ఆట తీరే మారబోతోంది. ఈసారి కేవలం సమాధానాలు గుర్తుపెట్టుకుంటే సరిపోదని, ప్రశ్నను అర్థం చేసుకొని ఆలోచించి సరైన నిర్ణయానికి రావాల్సి ఉంటుందని అమితాబ్ బచ్చన్ తెలిపారు. ‘సోచ్‌నా పడేగా’ థీమ్‌తో రూపొందించిన కేబీసీ-18 ప్రోమోలను సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా విడుదల చేసింది.
ఇప్పుడు సమాధానాలు అందరి ఫోన్‌లో అందుబాటులో ఉన్నాయని అమితాబ్ అన్నారు. అందుకే ఈసారి కేబీసీలో కొన్ని మార్పులు చేశామని వెల్లడించారు. సమాధానాలను కంఠస్థం చేయడం ఒక్కటే సరిపోదని, ఆ సమాచారాన్ని అర్థం చేసుకొని సరైన సమాధానానికి చేరుకోవడానికి ఆలోచించాల్సి ఉంటుందని చెప్పారు. అందుకే ఈ సీజన్‌కు ‘సోచ్‌నా పడేగా’ అనే థీమ్‌ను తీసుకొచ్చామని వివరించారు.
భూగోళశాస్త్రం, చరిత్ర, విజ్ఞానశాస్త్రంపై అవగాహన ఉంటే ఈసారి సరిపోదని రెండో ప్రోమోలో అమితాబ్ స్పష్టం చేశారు. ఆట స్వరూపమే మారిందని, కేవలం జవాబులు గుర్తుపెట్టుకోవడం కాకుండా వాటిని విశ్లేషించి సరైన సందర్భంలో ఉపయోగించే సామర్థ్యం ఉండాలని స్పష్టం చేశారు.
ప్రపంచాన్ని ఏఐ పూర్తిగా మార్చేస్తోందని, ఈ మార్పులు ఇక ఆగబోవని అమితాబ్ మూడో ప్రోమోలో అన్నారు. నిన్న అసాధ్యంగా కనిపించిన విషయాలు ఈరోజు క్షణాల్లో సాధ్యమవుతున్నాయని అన్నారు. ఇలాంటి ప్రపంచంలో మన ఆలోచనా విధానం కూడా మారాల్సిందేనని తెలిపారు. ఆ ఉద్దేశంతోనే కేబీసీలో మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. ఇప్పుడు జవాబు చెప్పే ముందు సమాచారాన్ని అర్థం చేసుకొని ఓ నిర్ణయానికి రావాల్సి ఉంటుందన్నారు.
కేబీసీ సీజన్-18 ఆగస్టు 10 నుంచి ప్రారంభం కానుంది. అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా కొనసాగుతున్నారు. విమర్శనాత్మకంగా ఆలోచించడం, సమాచారాన్ని విశ్లేషించడం, మారుతున్న పరిస్థితులకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవడమే అసలు నైపుణ్యమనే సందేశాన్ని కొత్త ప్రోమోలు ఇస్తున్నాయి.
ఈ ప్రచారంపై సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా ప్రతినిధి స్పందించారు. కేబీసీ జ్ఞానానికి ప్రతీకగా మారిందని తెలిపారు. ఈసారి తెలిసిన విషయాలను సరైన సమయంలో ఎలా ఉపయోగించాలి, ఎలా నిర్ణయాలు తీసుకోవాలన్న దానిపైనే దృష్టి పెట్టామని చెప్పారు. నేటి ప్రపంచానికి అవసరమైన ఆలోచనా విధానాన్నే ఈ సీజన్ ప్రోత్సహిస్తోందని వెల్లడించారు.