చే'నేత'కు ఏపీ సర్కార్ గౌరవం.. రాష్ట్ర పండుగగా ప్రగడ కోటయ్య జయంతి
- ప్రతి ఏటా జులై 26న అధికారికంగా వేడుకలు నిర్వహించాలంటూ ఉత్తర్వులు
- చేనేత రంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ నిర్ణయం
- ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి ఎస్. సవిత
చేనేత రంగ అభివృద్ధికి విశేష కృషి చేసిన ప్రగడ కోటయ్య జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏటా జులై 26న ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
చేనేత రంగానికి ప్రగడ కోటయ్య అందించిన విశిష్ట సేవలను గుర్తించి, ఆయనను సముచిత రీతిలో గౌరవించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయం పట్ల చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత హర్షం వ్యక్తం చేశారు. చేనేత పరిశ్రమ పురోగతి కోసం ప్రగడ కోటయ్య అహర్నిశలు శ్రమించారని, ప్రజా నాయకుడిగా చెరగని ముద్ర వేశారని ఆమె కొనియాడారు. ఈ చారిత్రక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర సాంస్కృతిక, ఆర్థిక వారసత్వంలో కీలకమైన చేనేత రంగానికి ప్రగడ కోటయ్య చేసిన సేవలు చిరస్మరణీయం. ఈ నేపథ్యంలో, సంబంధిత కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పరిశ్రమలు, వాణిజ్య శాఖను ప్రభుత్వం ఆదేశించింది.