ఏపీలో స్వాతంత్య్ర వేడుకలపై సీఎస్ ఉన్నతస్థాయి సమీక్ష..కీలక ఆదేశాలు

CS high level review on Independence Day celebrations in AP key orders
  • రాష్ట్రంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు భారీ ఏర్పాట్లు
  •  'స్వర్ణాంధ్ర 2047' ఇతివృత్తంతో ఈసారి వేడుకల నిర్వహణ
  •  అమరావతిలోని పరేడ్ గ్రౌండ్‌లో జరగనున్న ప్రధాన కార్యక్రమం
  •  ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తూ శకటాల ప్రదర్శన
  •  ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
ఆంధ్రప్రదేశ్‌లో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను గతంలో ఎన్నడూ లేని రీతిలో అత్యంత ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత సన్నాహాలు చేస్తోంది. 'స్వర్ణాంధ్ర 2047' ఇతివృత్తంతో రాజధాని అమరావతి వేదికగా ఈ వేడుకలను నిర్వహించనున్నారు. కార్యక్రమ ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జె. సాయి ప్రసాద్ శుక్రవారం సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ప్రధాన వేడుకలను అమరావతిలోని పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేలా, వారిలో అవగాహన పెంపొందించేలా ఆయా శాఖలు ప్రత్యేక శకటాలను (ట్యాబ్లోలు) ప్రదర్శించాలని సీఎస్ ఆదేశించారు. ఈ సమావేశంలో జీఏడీ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వేడుకల నిర్వహణ ప్రణాళికను వివరించారు.

ఈ జాతీయ పండుగ నిర్వహణలో ఎటువంటి లోపాలకు తావులేకుండా పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎస్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.                                
Advertisement
J Sai Prasad
Andhra Pradesh Independence Day celebrations
Swarnandhra 2047
Amaravati Parade Ground
AP CS high level review
Independence Day arrangements AP

More Telugu News