పెళ్లికి ఓకే చెప్పే ముందు.. ఈ విషయాలు తప్పక మాట్లాడుకోండి..!
- ఇద్దరి ఆలోచనలు ఒకటేనా తెలుసుకోండి
- తల్లిదండ్రులతో కలిసి ఉంటారా కనుక్కోండి
- డబ్బుపై భాగస్వామి అభిప్రాయమేంటో అర్థం చేసుకోండి
- పెళ్లి అంటే వారి దృష్టిలో ఏంటో తెలుసుకోండి
- అలా ప్రశ్నల వరద పారించి భయపెట్టొద్దంటున్న నిపుణులు
పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తులు కలిసి తీసుకునే అతిపెద్ద నిర్ణయం. కానీ చాలా సందర్భాల్లో పెళ్లి చూపులు మాత్రం కొన్ని నిమిషాల పరిచయానికే పరిమితమవుతాయి. ఇలాంటి సమయంలో రూపం, ఉద్యోగం మాత్రమే కాదు.. జీవితాంతం కలిసి నడిచే మనిషి ఆలోచనలు కూడా తెలుసుకోవాలి. అందుకే పెళ్లికి ఓకే చెప్పే ముందు కొన్ని విషయాలపై తప్పకుండా మాట్లాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇద్దరి ఆలోచనలు ఒకటేనా?
పెళ్లి తర్వాత ఐదేళ్లు, పదేళ్లకు ఎలా ఉండాలనుకుంటున్నారో ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. ఉద్యోగం, పిల్లలు, విదేశాలకు వెళ్లడం వంటి అంశాల్లో ఇద్దరి అభిప్రాయాలు తెలుసుకోవాలి. కలలు వేర్వేరుగా ఉండొచ్చు. కానీ ఇద్దరి దారి ఒకే వైపు ఉండాలి.
పెళ్లి తర్వాత కుటుంబ పాత్ర?
తల్లిదండ్రులతో కలిసి ఉంటారా.. వేరుగా ఉంటారా అనే విషయం ముందే స్పష్టతకు రావాలి. పండుగలు, కుటుంబ బాధ్యతలు, నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల పాత్ర ఎంత ఉంటుందో తెలుసుకోవాలి. తర్వాత అపార్థాలు రాకుండా ఇది చాలా ఉపయోగపడుతుంది.
డబ్బు విషయంలో ఇద్దరి ఆలోచన?
సంపాదన కంటే డబ్బును ఎలా ఖర్చు చేస్తారనేదే ముఖ్యం. పొదుపు, ఖర్చు, రుణాలపై ఇద్దరి అభిప్రాయాలు తెలుసుకోవాలి. ఇంటి ఖర్చులను ఎలా నిర్వహించాలనుకుంటున్నారో కూడా మాట్లాడుకోవాలి.
అభిప్రాయ భేదాలు వస్తే?
ప్రతి దంపతుల మధ్య విభేదాలు సహజమే. కానీ వాటిని ఎలా పరిష్కరిస్తారనేదే సంబంధాన్ని బలంగా నిలబెడుతుంది. కోపం వచ్చినప్పుడు ఎలా ప్రవర్తిస్తారు.. క్షమాపణ చెప్పగలరా అనే విషయాలు తెలుసుకోవాలి.
పెళ్లి అంటే వారి దృష్టిలో ఏంటి?
ఒక్కో వ్యక్తికి పెళ్లిపై ఒక్కో అభిప్రాయం ఉంటుంది. కొందరికి అది బంధం అయితే, మరికొందరికి కుటుంబ బాధ్యత. జీవిత భాగస్వామి నుంచి ఏం ఆశిస్తున్నారో ముందే మాట్లాడుకోవాలి.
ప్రశ్నల వరద పారించొద్దు
పెళ్లి చూపులను ఇంటర్వ్యూలా మార్చకూడదు. సహజంగా మాట్లాడుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఎదుటి వ్యక్తి కూడా మీ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి చూపుతున్నారా లేదా గమనించాలి.
పర్ఫెక్ట్ వ్యక్తి కోసం చూడొద్దు
ప్రతి మనిషిలో కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి. కొన్ని లోపాలు కూడా ఉంటాయి. అన్ని విషయాల్లో ఒకేలా ఉండాల్సిన అవసరం లేదు. భిన్నాభిప్రాయాలను గౌరవించగలగడం ముఖ్యం.
నిర్ణయంలో తొందరపడొద్దు
కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్ల త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. అవసరమైతే మరోసారి కలవండి. పెళ్లి ఏర్పాట్ల కంటే రోజువారీ జీవితంపై ఎక్కువగా మాట్లాడండి.
పెళ్లి వేడుక ఒక్కరోజే ఉంటుంది. కానీ వైవాహిక జీవితం మాత్రం ఎన్నో సంవత్సరాలు కొనసాగుతుంది. అందుకే బయోడేటా చూసి కాదు.. మనిషిని అర్థం చేసుకుని నిర్ణయం తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.