తక్కువ ఖర్చుతో గుండెకు రక్షణ.. ఈ పండ్లను మిస్ కాకండి
- పండ్లలో ఉండే పీచు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లతో గుండెకు మేలు
- బెర్రీల్లో యాంటీఆక్సిడెంట్లు, పీచు
- నారింజలోని ఫ్లేవనాయిడ్లతో రక్తనాళాల మెరుగైన పనితీరు
- అవకాడోలో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు
- దానిమ్మలోని పాలిఫెనాల్స్‌తో ఆక్సిడేటివ్ ఒత్తిడి తగ్గింపు
- అరటిపండులోని పొటాషియంతో రక్తపోటు నియంత్రణ
గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మందుల కంటే ముందు ఆహారంపైనే దృష్టి పెట్టాలి. పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల గుండె పనితీరు మెరుగుపడుతుంది. ముఖ్యంగా కొన్ని పండ్లలో ఉండే పీచు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు గుండెకు మేలు చేస్తాయి. రోజువారీ ఆహారంలో వీటికి చోటు కల్పిస్తే గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. పైగా ఇవి అన్ని పండ్ల దుకాణాల్లో లభించేవే. అలాగే అందుబాటు ధరలోనూ ఉంటాయి. సామాన్యులు సైతం కొని తినొచ్చు.
బెర్రీలు: వీటిలో యాంటీఆక్సిడెంట్లు, పీచు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా ఆంథోసయానిన్స్ వంటి సమ్మేళనాలు రక్తనాళాలను ఆక్సిడేటివ్ ఒత్తిడి నుంచి కాపాడతాయి. పీచు ఎల్‌డీఎల్ (చెడు) కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో ఉపయోగపడుతుంది.
నారింజ: నారింజల్లో విటమిన్-సి, పొటాషియం, పీచు పుష్కలంగా లభిస్తాయి. వీటిలో ఉండే సిట్రస్ ఫ్లేవనాయిడ్లు రక్తనాళాల పనితీరుకు మేలు చేస్తాయి. పొటాషియం రక్తపోటు నియంత్రణకు తోడ్పడుతుంది. విటమిన్-సి రక్తనాళాలపై ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గిస్తుంది.
అవకాడో: వీటిలో మోనో అన్‌సాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి గుండెకు మేలు చేస్తాయి. ఇందులో ఉండే పీచు, పొటాషియం కూడా గుండె ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. మంచి కొలెస్ట్రాల్ సమతుల్యతను నిలబెట్టడంలో ఈ పోషకాలు సహకరిస్తాయి.
దానిమ్మ: దీంట్లో పాలీఫెనాల్స్ అనే శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కణాలపై ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గిస్తాయి. రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడతాయి.
అరటిపండు: అరటిపండులో పొటాషియం, పీచు మంచి మోతాదులో ఉంటాయి. పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పీచు కొలెస్ట్రాల్ నియంత్రణకు తోడ్పడుతుంది. ఈ రెండు కలిసి గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉపయోగపడతాయి.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. ఆహారంలో మార్పులు చేసేముందు, ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు ఉంటే వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.