ప్రియాంకతో 8 ఏళ్ల జీవితం.. నిక్‌ను ఎక్కువగా ఆకట్టుకున్నది ఇదేనట!
- బాలీవుడ్ గాసిప్‌లంటే ఇష్టమన్న నిక్ జోనాస్
- బ్రేకప్ వార్తలు కూడా ప్రియాంక కంటే ముందే తనకు తెలుస్తాయని వెల్లడి
- కొన్ని బాలీవుడ్ గాసిప్ అకౌంట్లను రహస్యంగా ఫాలో అవుతున్నానని వెల్లడి
- ఎవరి పేర్లు మాత్రం చెప్పనని సరదాగా వ్యాఖ్యానించిన నిక్
- నిక్ వ్యాఖ్యలపై సరదాగా స్పందించిన ప్రియాంక
ప్రముఖ నటి ప్రియాంక చోప్రాతో వివాహ జీవితం గురించి అమెరికన్ గాయకుడు, నటుడు నిక్ జోనాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తమ దాంపత్య జీవితంలో తనకు అత్యంత నచ్చిన విషయాల్లో ఒకటి బాలీవుడ్ పుకార్లేనని సరదాగా చెప్పడం అభిమానులను ఆకట్టుకుంది.
జోనాస్ బ్రదర్స్ కొత్త పాడ్‌కాస్ట్ ‘హే జోనాస్!’ కార్యక్రమంలో నిక్, ప్రియాంక చోప్రా, కెవిన్ జోనాస్, జో జోనాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన నిక్.. ‘‘ఈ ఎనిమిదేళ్లలో నాకు బాగా నచ్చిన విషయాల్లో ఒకటి బాలీవుడ్‌కు సంబంధించిన గాసిప్‌లన్నీ తెలుసుకోవడం’’ అని నవ్వుతూ చెప్పాడు.
దీనిపై వెంటనే స్పందించిన ప్రియాంక.. ‘‘మన పెళ్లిలో నీకు ఎక్కువగా నచ్చింది అదేనా? నీ సోషల్ మీడియా ఫీడ్ మొత్తం గాసిప్‌లతోనే నిండిపోయి ఉంటుంది’’ అంటూ సరదాగా ఆటపట్టించింది.
బాలీవుడ్‌లో ఎవరు ప్రేమలో ఉన్నారు.. ఎవరు విడిపోయారు వంటి విషయాలు కూడా తనకంటే ముందే నిక్‌కు తెలిసిపోతాయని ప్రియాంక వెల్లడించింది. ‘‘నేను ఎవరికైనా మెసేజ్ చేస్తూ.. ‘మీ పార్ట్‌నర్‌కు కూడా నా శుభాకాంక్షలు చెప్పండి’ అంటే.. ‘వాళ్లు ఇప్పుడు కలిసి లేరు.. విడిపోయారు’ అని నిక్ చెబుతుంటాడు. అప్పుడు బాలీవుడ్ గాసిప్‌లను తనే ఎక్కువగా ఫాలో అవుతున్నాడని అర్థమవుతుంది’’ అని ఆమె సరదాగా వ్యాఖ్యానించింది.
ప్రియాంక వ్యాఖ్యలను సమర్థించిన నిక్.. ‘‘అవును.. నేను గాసిప్‌లను ఫాలో అవుతుంటాను’’ అని అంగీకరించాడు. అయితే ఏ సెలబ్రిటీల గురించి ఎక్కువగా తెలుసుకుంటావని కెవిన్, జో అడగ్గా.. ‘‘వాళ్లంతా మన స్నేహితులే.. పేర్లు మాత్రం చెప్పలేను’’ అని నవ్వుతూ సమాధానం ఇచ్చాడు.
కొన్ని బాలీవుడ్ గాసిప్ సోషల్ మీడియా అకౌంట్లను తాను రహస్యంగా ఫాలో అవుతున్నానని కూడా నిక్ వెల్లడించాడు. ‘‘కొన్ని అకౌంట్లను ఎవరికీ తెలియకుండా ఫాలో అవుతుంటాను. అక్కడ వచ్చే కథనాలు, పరిణామాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి’’ అని చెప్పాడు.
ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ 2017లో జరిగిన ఆస్కార్ ఆఫ్టర్ పార్టీ సందర్భంగా తొలిసారి కలుసుకున్నారు. 2018లో ప్రేమలో పడి అదే ఏడాది నిశ్చితార్థం చేసుకున్నారు. అనంతరం రాజస్థాన్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం ఘనంగా వివాహం చేసుకున్నారు. 2022లో సరొగసీ ద్వారా కుమార్తె మాల్టీ మేరీ చోప్రా జోనాస్‌కు తల్లిదండ్రులయ్యారు.