ఏడు నెలల్లో మూడోసారి.. థార్ ధరలు మళ్లీ పెరిగాయి!
- గరిష్ఠంగా రూ.37 వేల వరకు పెంపు
- జులై 10 నుంచి కొత్త ధరలు అమలు
- థార్ ధర రూ.10.32 లక్షల నుంచి ప్రారంభం
- ముడి సరకుల ధరల పెరుగుదలే కారణమని కంపెనీ వెల్లడి
మహీంద్రా థార్‌ను కొనాలని భావిస్తున్న వారికి కంపెనీ మరో షాక్ ఇచ్చింది. కేవలం ఏడు నెలల్లోనే మూడోసారి ధరలు పెంచింది. ఈసారి వేరియంట్‌ను బట్టి గరిష్ఠంగా రూ.37 వేల వరకు సవరించింది. కొత్త ధరలు జులై 10 నుంచి అమల్లోకి వచ్చినట్లు కంపెనీ వెల్లడించింది.
తాజా ధరల పెంపు థార్‌లోని అన్ని వేరియంట్లకు వర్తిస్తుందని మహీంద్రా తెలిపింది. ముడి సరకుల ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇంజిన్, గేర్‌బాక్స్, డ్రైవ్‌ట్రెయిన్ ఆధారంగా ధరల పెంపు మారుతోంది. టాప్ ఎండ్ ఎల్‌ఎక్స్‌టీ 4డబ్ల్యూడీ 2.2 డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్‌పై అత్యధికంగా రూ.37 వేలు పెంచింది. ఎల్‌ఎక్స్‌టీ 4డబ్ల్యూడీ పెట్రోల్ ఆటోమేటిక్‌పై రూ.36 వేలు, ఎల్‌ఎక్స్‌టీ 4డబ్ల్యూడీ డీజిల్ మాన్యువల్‌పై రూ.34 వేల వరకు పెంచింది.
ప్రస్తుతం థార్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.10.32 లక్షల నుంచి ప్రారంభమై, టాప్ వేరియంట్‌కు రూ.17.99 లక్షల వరకు ఉంది. ఎంట్రీ లెవల్ ఏఎక్స్‌టీ 2డబ్ల్యూడీ డీజిల్ మాన్యువల్ వేరియంట్ ధర రూ.10.32 లక్షలు కాగా, టాప్ స్పెక్ ఎల్‌ఎక్స్‌టీ 4డబ్ల్యూడీ డీజిల్ ఆటోమేటిక్ ధర రూ.17.99 లక్షలకు చేరింది.
ఈ ఏడాది థార్ ధరలు పెరగడం ఇది మూడోసారి. జనవరిలో రూ.20 వేల వరకు, ఏప్రిల్‌లో రూ.43 వేల వరకు ధరలు పెంచిన కంపెనీ ఇప్పుడు మరోసారి ధరలను సవరించింది. దీంతో ఏడు నెలల వ్యవధిలోనే మూడు సార్లు ధరలు పెరిగినట్లైంది. థార్‌ను కొనుగోలు చేయాలనుకునే వారు బుకింగ్‌కు ముందు తాజా ఆన్‌రోడ్ ధరను డీలర్ వద్ద ఒకసారి నిర్ధారించుకోవడం మంచిదని కంపెనీ సూచించింది.