ఫ్రెషర్లకు షాక్.. హెచ్‌సీఎల్‌టెక్ నియామకాల్లో భారీ మార్పు!
- ఫ్రెషర్ల కంటే ప్రత్యేక నైపుణ్యాలున్న ఇంజినీర్లకే ప్రాధాన్యం
- ఎంపికైన వారికి నాలుగు రెట్ల అధిక వేతనం
- ఏఐ, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీపై ఫోకస్
- రెండేళ్లలో కొత్త బృందం ఏర్పాటు
- సాంకేతిక నైపుణ్యాలతో పాటు కస్టమర్లతో పనిచేసే సామర్థ్యం కూడా అవసరమన్న సంస్థ
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావంతో ఐటీ రంగంలో నియామకాల తీరు వేగంగా మారుతోంది. ఈ నేపథ్యంలో దేశంలోని మూడో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ హెచ్‌సీఎల్‌టెక్ కొత్త వ్యూహాన్ని అమలు చేయనుంది. ఇకపై పెద్ద సంఖ్యలో ఫ్రెషర్లను నియమించుకోవడం కంటే ప్రత్యేక నైపుణ్యాలున్న ఇంజినీర్లను ఎంపిక చేయడంపైనే దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించింది. అలాంటి వారికి సాధారణ ఫ్రెషర్లతో పోలిస్తే నాలుగు రెట్లు ఎక్కువ వేతనం ఇవ్వనున్నట్లు తెలిపింది.
హెచ్‌సీఎల్‌టెక్ ‘చీఫ్ పీపుల్ ఆఫీసర్’ రామ్ సుందరరాజన్ ఈ విషయాన్ని వెల్లడించారు. రానున్న రెండు నుంచి మూడేళ్లలో ప్రత్యేక నైపుణ్యాలున్న ఇంజినీర్ల బృందాన్ని తయారు చేయనున్నట్లు చెప్పారు. వీరిని ‘ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజినీర్లు’గా తీర్చిదిద్దనున్నట్లు పేర్కొన్నారు. కస్టమర్ల వ్యాపార అవసరాలను అర్థం చేసుకుని ఏఐ ఆధారిత పరిష్కారాలను వేగంగా అందించే బాధ్యత వీరిపై ఉంటుందని వివరించారు.
సంప్రదాయ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లతో పోలిస్తే ఈ విభాగంలో పనిచేసే వారికి సాంకేతిక నైపుణ్యాలతో పాటు కస్టమర్లతో నేరుగా పనిచేసే సామర్థ్యం కూడా అవసరమని సంస్థ తెలిపింది. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా ఇంజినీరింగ్, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ వంటి రంగాల్లో నైపుణ్యాలు ఉన్నవారికే ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఈ ప్రత్యేక కార్యక్రమానికి ఎంపికైన వారికి సాధారణ ఫ్రెషర్ల వేతనంతో పోలిస్తే నాలుగు రెట్లు ఎక్కువ ప్యాకేజీ ఉండే అవకాశం ఉందని తెలిపింది.
ఏఐ ప్రాజెక్టుల్లో చేరిన వెంటనే పనిచేయగలిగే ఉద్యోగులను సంస్థలు కోరుకుంటున్నాయని హెచ్‌సీఎల్‌టెక్ పేర్కొంది. దీంతో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తీసుకుని తర్వాత శిక్షణ ఇవ్వడం కంటే, ముందుగానే నైపుణ్యాలు ఉన్న వారిని ఎంపిక చేసే విధానానికి ప్రాధాన్యం పెరుగుతోందని వివరించింది.