బీఎస్ఎన్ఎల్‌కు నెలకు ఒక్కో యూజర్ నుంచి ఎంత ఆదాయం వస్తుందో తెలుసా?
- ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 10 శాతం పెరిగిన బీఎస్ఎన్ఎల్ ఆదాయం
- కార్యకలాపాల ద్వారా రూ. 4,418 కోట్ల ఆదాయం ఆర్జించినట్లు వెల్లడి
- గతేడాదితో పోలిస్తే ఇది రూ. 401 కోట్లు అధికం
- గతంలో రూ. 100గా ఉన్న ఏఆర్‌పీయూ ప్రస్తుతం రూ. 102.7కు చేరిక
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) పనితీరులో సానుకూల వృద్ధి కనిపిస్తోంది. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) సంస్థ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం దాదాపు 10 శాతం పెరిగినట్లు కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు. బీఎస్ఎన్ఎల్ తొలి త్రైమాసిక పనితీరుపై జరిగిన సమీక్షా సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో బీఎస్ఎన్ఎల్ రూ. 4,017 కోట్ల ఆదాయాన్ని నమోదు చేయగా, ఈ ఏడాది అదే కాలానికి అది రూ. 4,418 కోట్లకు చేరిందని సింధియా తెలిపారు. తద్వారా సంస్థ ఆదాయంలో రూ. 401 కోట్ల పెరుగుదల నమోదైందని వివరించారు. ఈ వృద్ధికి ప్రధానంగా ఎంటర్‌ప్రైజ్ బిజినెస్, కన్స్యూమర్ మొబిలిటీ విభాగాలు దోహదపడినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే, కన్స్యూమర్ ఫిక్స్‌డ్ యాక్సెస్ విభాగంలో మాత్రం వృద్ధి దాదాపు నిలకడగా ఉందని చెప్పారు.
ఈ త్రైమాసికంలో బీఎస్ఎన్ఎల్ ఒక్కో వినియోగదారుడిపై సగటు ఆదాయం (ఏఆర్‌పీయూ) కూడా పెరిగినట్లు మంత్రి తెలిపారు. గతంలో రూ. 100గా ఉన్న ఏఆర్‌పీయూ, రూ. 102.7కు చేరిందని ఆయన పేర్కొన్నారు. సంస్థ పనితీరును మెరుగుపరిచేందుకు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.