భారతీయుడి మృతితో కేంద్రం సీరియస్‌.. ఇరాన్‌కు భారత్‌ గట్టి హెచ్చరిక!

Government of India serious over Indian death strong warning to Iran
  • హర్మూజ్‌ దాడిలో భారతీయుడి మృతి
  • మరో ఆరుగురు భారతీయులకు గాయాలు
  • ఇరాన్‌ రాయబారిని పిలిపించిన భారత్‌
  • దాడిపై అధికారిక నిరసన నమోదు
  • రెండు చమురు ట్యాంకర్లకు నష్టం
  • ఘటనను తీవ్రంగా ఖండించిన యూఏఈ
హర్మూజ్‌ జలసంధిలో యూఏఈకి చెందిన చమురు ట్యాంకర్లపై జరిగిన దాడిలో ఓ భారతీయుడు మరణించిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించి భారత్‌లోని ఇరాన్‌ రాయబార కార్యాలయ డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ మిషన్‌ మహ్మద్‌ జావెద్‌ హుస్సేనీని విదేశాంగ శాఖ పిలిపించి నిరసన తెలిపింది.

ఒమన్‌కు సమీపంలోని హర్మూజ్‌ జలసంధి దక్షిణ మార్గంలో ప్రయాణిస్తున్న ‘మొంబాసా’, ‘అల్‌ బహియాహ్‌’ చమురు ట్యాంకర్లపై ఈ దాడి జరిగింది. ‘మొంబాసా’ నౌకలో పనిచేస్తున్న ఓ భారతీయ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది గాయపడగా, వారిలో ఆరుగురు భారతీయులు, ఇద్దరు ఉక్రెయిన్‌ పౌరులు ఉన్నారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

దాడి కారణంగా రెండు ట్యాంకర్లలోనూ మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. అయితే వెంటనే సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో రెండు నౌకలకు భారీ నష్టం వాటిల్లినట్లు వెల్లడించారు.

ఈ దాడిని అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ ఖండించింది. ప్రాంతీయ భద్రత, స్థిరత్వానికి ఇది తీవ్ర ముప్పు అని అభివర్ణించింది. ఈ పరిణామంపై స్పందించే పూర్తి హక్కు యూఏఈకి ఉందని స్పష్టం చేసింది. దేశ భద్రత, ప్రజలు, జాతీయ ప్రయోజనాలు, కీలక ఆస్తుల రక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.
Advertisement
Government of India
Iran
Strait of Hormuz
UAE Oil Tanker Attack
Indian National Death
Ministry of External Affairs

More Telugu News