‘సార్, మిమ్మల్ని హగ్ చేసుకోవచ్చా?’.. సీఎం విజయ్ రియాక్షన్ ఇదే!
- హగ్ చేసుకోవచ్చా? అని సీఎం విజయ్‌ని అడిగిన జూనియర్ డాక్టర్
- చిరునవ్వుతో అంగీకరించిన ముఖ్యమంత్రి
- చెన్నైలో ఆరోగ్య శాఖ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఘటన
- మొత్తం 2,144 మందికి నియామక ఉత్తర్వులు అందజేత
- సీఎం విజయ్ నిరాడంబరతపై నెటిజన్ల ప్రశంసల వర్షం
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మరోసారి తన నిరాడంబరతతో, మానవీయ కోణంతో ప్రజల మనసులను గెలుచుకున్నారు. చెన్నైలో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో ఓ యువ డాక్టర్ ఆయనను ఆప్యాయంగా కౌగిలించుకున్న ఘటన అందరినీ ఆకట్టుకుంటోంది. "సార్, మిమ్మల్ని ఒకసారి హగ్ చేసుకోవచ్చా?" అని ఆ డాక్టర్ అడగ్గా, సీఎం విజయ్ చిరునవ్వుతో అంగీకరించి అతడిని ఆప్యాయంగా హత్తుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తమిళనాడు వైద్యారోగ్య శాఖలో కొత్తగా ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించేందుకు చెన్నైలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 751 మంది అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్లు, 1,393 మంది హెల్త్ ఇన్‌స్పెక్టర్లతో కలిపి మొత్తం 2,144 మందికి సీఎం విజయ్ చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు పంపిణీ చేశారు. ఈ క్రమంలోనే స్టేజ్‌పైకి వచ్చిన ఓ జూనియర్ డాక్టర్, తన అభిమాన నేతను చూసి ఈ విధంగా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విజయ్.. ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి సామాన్యులతో మమేకమవుతున్నారు. గతంలో కూడా ఓ గర్భిణీ అభ్యర్థిని కోసం స్వయంగా స్టేజ్ దిగి వచ్చి ఆమెకు నియామక పత్రం అందించిన సంగతి తెలిసిందే. తాజా ఘటనతో సీఎం హోదాలో ఉన్నప్పటికీ ఎంతో ఆప్యాయంగా మెలుగుతున్న విజయ్ తీరుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.