నితిన్ గడ్కరీతో భేటీ అయిన రేవంత్ రెడ్డి
- 20 రోజుల వ్యవధిలో రెండోసారి ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి
- రీజనల్ రింగ్ రోడ్డు పనుల గురించి గడ్కరీతో చర్చించిన సీఎం
- రామ్మోహన్ నాయుడిని కూడా కలవనున్న ముఖ్యమంత్రి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఫుల్ బిజీగా ఉన్నారు. కేవలం 20 రోజుల వ్యవధిలోనే ఆయర రెండోసారి ఢిల్లీకి వెళ్లడం గమనార్హం. ఈ ఉదయం కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని రేవంత్ కలిశారు. రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర (నార్త్) భాగం పనులకు వెంటనే కేబినెట్ ఆమోదం తెలపాలని, దక్షిణ భాగానికి పూర్తి అనుమతులు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర జాతీయ రహదారులను డ్రై పోర్టులతో అనుసంధానించే కొత్త దారులకు అనుమతులు ఇవ్వాలని విన్నవించారు.
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని కూడా రేవంత్ కలవనున్నారు. తెలంగాణలో మూడు ఎయిర్ పోర్టులకు సంబంధించి చర్చించనున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో కూడా ముఖ్యమంత్రి భేటీ కాననున్నారు.