జగన్ శవ రాజకీయాలు మానాలి: పల్లా శ్రీనివాసరావు
- జగన్ విశాఖ పర్యటనపై పల్లా విమర్శలు
- వైసీపీ హయాంలో మత్స్యకారులకు జగన్ ఎలాంటి న్యాయం చేయలేదని విమర్శ
- రాజకీయ లాభం కోసమే జగన్ విశాఖకు వస్తున్నారని మండిపాటు
వైసీపీ అధినేత జగన్ విశాఖ పర్యటనపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్రంగా స్పందించారు. ఇప్పటికైనా జగన్ శవ రాజకీయాలు మానుకోవాలని హితవు చెప్పారు. విశాఖకు ఎందుకు వస్తున్నారో ముందు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో మత్స్యకారులకు ఎలాంటి న్యాయం చేయలేదని విమర్శించారు. వారికి చట్టప్రకారం చెల్లించాల్సిన బకాయిలు కూడా చెల్లించలేదన్నారు. మత్స్యకార నిధులను డైవర్ట్ చేశారని ఆరోపించారు.
అసలు, మత్స్యకారులకు జగన్ ఏం చేశారో సమాధానం చెప్పాలని పల్లా శ్రీనివాసరావు సవాల్ విసిరారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడి ప్రమాద ఘటన గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. జగన్ రాజకీయ లాభం కోసమే విశాఖకు వస్తున్నారని ఆరోపించారు.