సీఎం రేవంత్ ను కలిసిన ఎమిరేట్స్ విమాన సంస్థ వైస్ ప్రెసిడెంట్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సీఎం రేవంత్ ను కలిసిన ఎమిరేట్స్ విమాన సంస్థ వైస్ ప్రెసిడెంట్

Emirates Vice President meets Revanth Reddy
  • రేవంత్ ను మర్యాదపూర్వకంగా కలిసిన మహమ్మద్ సార్ధన్
  • రాష్ట్రానికి ఎమిరేట్స్ సేవలను పెంచాలని కోరిన రేవంత్
  • రాష్ట్రానికి రెండు కొత్త విమానాశ్రాయాలు వస్తున్నాయని చెప్పిన సీఎం
ప్రముఖ అంతర్జాతీయ విమానయాన సంస్థ ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సార్థన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమిరేట్స్ వైమానిక సంస్థ 25వ వార్షికోత్సవాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జూబ్లీహిల్స్‌లో ఈ భేటీ జరిగింది. తెలంగాణలో రెండు కొత్త విమానాశ్రయాల నిర్మాణం జరగబోతోందని... రాష్ట్రానికి ఎమిరేట్స్ విమాన సర్వీసులను మరింత పెంచాలని ఈ సందర్భంగా సార్థన్ ను రేవంత్ రెడ్డి కోరారు. దీంతో, హైదరాబాద్‌కు ఏ-380 విమాన సర్వీసులు ప్రారంభించేందుకు ఎమిరేట్స్ సంస్థ ఆసక్తి చూపించింది. 

ఎమిరేట్స్‌కు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అంతేకాకుండా గచ్చిబౌలి స్పోర్ట్స్ యూనివర్సిటీకి స్పాన్సర్‌షిప్ అందించాలని రేవంత్ రెడ్డి కోరగా, ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ సానుకూలంగా స్పందించారు. త్వరలో తెలంగాణలో వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో కొత్త విమానాశ్రయాలను నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విమాన సర్వీసులు పెంచాలని ఎమిరేట్స్ ను రేవంత్ కోరారు.
Advertisement
Revanth Reddy
Emirates Airlines
Mohammad Sarhan
Telangana New Airports
Hyderabad A380 Services
Gachibowli Sports University

More Telugu News