వియత్నాంలో బోటు ప్రమాదం... భారత ఎంబసీతో మాట్లాడిన మంత్రి నారా లోకేశ్

Nara Lokesh speaks with Indian Embassy on Vietnam boat accident
  • వియత్నాంలో పడవ బోల్తా పడి 15 మంది భారతీయులు మృతి
  • మృతుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు ఉన్నట్లు వెల్లడి
  • స్పందించిన మంత్రి నారా లోకేశ్, ఎంబసీ అధికారులతో సంప్రదింపులు
  • బాధితులకు అన్ని విధాలా సాయం అందిస్తామని హామీ
  • కేంద్రంతో సమన్వయం చేసుకోవాలని ఢిల్లీ ఏపీ భవన్ అధికారులకు ఆదేశం
వియత్నాంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 15 మంది భారతీయులు జలసమాధి అయ్యారు. మృతుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు కూడా ఉన్నారని తెలియడంతో రాష్ట్రంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం తక్షణమే స్పందించి, సహాయక చర్యలకు ఉపక్రమించింది.

ఈ విషయం తెలియగానే రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ వియత్నాంలోని భారత రాయబార కార్యాలయ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రమాదం జరిగిన తీరు, ప్రస్తుత పరిస్థితుల గురించి ఆరా తీశారు. బాధితులకు తక్షణమే అవసరమైన సహాయం అందించాలని ఆయన ఎంబసీ అధికారులను కోరారు. ముఖ్యంగా, ప్రమాదంలో మరణించిన తెలుగువారి కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.

ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపట్టాలని ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులకు మంత్రి లోకేశ్ ఆదేశాలు జారీ చేశారు. మృతుల కుటుంబాలకు అవసరమైన సాయం అందించేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని ఆయన సూచించారు.
Advertisement
Nara Lokesh
Vietnam Boat Accident
Indian Embassy Vietnam
Andhra Pradesh Victims
Vietnam Boat Tragedy
AP Government Relief

More Telugu News