షమితా శెట్టి ఎండోమెట్రియోసిస్ బాధ.. డాక్టర్ సలహా విని షాక్!
- ఎండోమెట్రియోసిన్ తో బాధపడిన షమితా శెట్టి
- బిడ్డను కనాలని షమితకు సలహా ఇచ్చిన డాక్టర్
- అప్పుడే ఎండోమెట్రియోసిస్ తగ్గుతుందని వివరణ
- ఇప్పటికీ అవివాహితగానే ఉన్న షమిత
బాలీవుడ్ నటి షమితా శెట్టి తన ఎండోమెట్రియోసిస్ అనుభవాన్ని ఓపెన్‌గా పంచుకుంటూ నెటిజన్లను ఆకట్టుకుంది. 2024 మేలో ఈ సమస్యకు శస్త్రచికిత్స చేయించుకున్న షమిత... సోహా అలీ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించిన ‘ఆల్ అబౌట్ హర్’ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఒక డాక్టర్ తనకు “ఓ బిడ్డను కను.. అదే ఎండోమెట్రియోసిస్‌కు నివారణి” అని సలహా ఇచ్చాడని షమిత చెప్పింది. దీనికి సమాధానంగా... “ఓకే. బేబీని పుట్టించేందుకు మనిషిని ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి?” అని సరదాగా అడిగానని వెల్లడించింది. 47 ఏళ్ల షమిత ఇప్పటికీ అవివాహితగానే ఉన్న సంగతి తెలిసిందే.
ఎండోమెట్రియోసిస్ అంటే ఏమిటి?
గర్భాశయం లైనింగ్ లాంటి కణజాలం గర్భాశయం వెలుపల పెరిగే దీర్ఘకాలిక సమస్య ఇది. తీవ్ర నొప్పి, ఇన్‌ఫ్లమేషన్, స్కార్ టిష్యూ ఏర్పడుతుంది. భారతదేశంలో సుమారు 40% మహిళలు ఈ సమస్యతో బాధపడుతున్నారని, చాలా మందికి దీని గురించి తెలియదని షమిత హెచ్చరించింది.
డాక్టర్ నీటా వార్టీ మాట్లాడుతూ, గర్భం దాల్చడం వల్ల ఈస్ట్రోజెన్ లెవెల్స్ తగ్గి తాత్కాలిక ఉపశమనం కలగవచ్చని చెప్పారు. కానీ ఇది శాశ్వత పరిష్కారం కాదని నిపుణులు చెబుతున్నారు. ఎండోమెట్రియోసిస్ ఫెర్టిలిటీని కూడా ప్రభావితం చేస్తుందని, ఓవరీలపై చాక్లెట్ సిస్టులు ఏర్పడి గుడ్ల నాణ్యత తగ్గుతుందని డాక్టర్ వివరించారు.
శరీరం ఇచ్చే సిగ్నల్స్‌ను మహిళలు వినాలని, నొప్పి ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని షమిత సలహా ఇచ్చింది.