లండన్ లో కోహ్లీని రహస్యంగా ఫొటోలు తీసిన వైనం.. బయటపెట్టిన కాక్స్
- కాక్స్‌తో కలిసి ఉన్నప్పుడు విరాట్‌ను ఎవరో రహస్యంగా ఫొటోలు తీసి వైరల్ చేసిన వైనం
- విరాట్ సాధారణ జీవితం కోరుకుంటాడన్న కాక్స్
- ఐపీఎల్‌లో తనకు అపారమైన సపోర్ట్ ఇచ్చాడని ప్రశంస
ఇంగ్లాండ్‌లోని లండన్ లో భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీని రహస్యంగా ఫొటోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసిన ఘటనపై అతడి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) సహచరుడు జార్డన్ కాక్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు. గత నెలలో లండన్‌లో ఇద్దరూ కలిసిన సందర్భంలో ఈ ఘటన జరిగింది. జార్డన్ కాక్స్ తన ఇంటర్వ్యూలో వెల్లడించిన వివరాల ప్రకారం, విరాట్‌తో కలిసి ఉండగా వందల మంది వారి పక్కనుంచి వెళ్లిపోయినా ఎవరూ గుర్తించలేదు. కానీ రెండు గంటల తర్వాత విరాట్ కాక్స్‌కు ఫోన్ చేసి “ఈ ఫొటోలు చూశావా?” అని అడిగాడు. ఎవరో రహస్యంగా వారిని చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది విరాట్‌ను చాలా బాధపెట్టిందని కాక్స్ చెప్పాడు.
“విరాట్ సాధారణ జీవితం గడపాలని కోరుకుంటాడు. కానీ అది సాధ్యం కావడం లేదు. ప్రజలు అతని ప్రైవసీని గౌరవించాలి” అని జార్డన్ కాక్స్ వ్యాఖ్యానించాడు. ఈ ఘటన క్రికెట్ ప్రపంచంలో ప్రైవసీ, సెలబ్రిటీల భద్రతపై చర్చనీయాంశమవుతోంది. కోహ్లీ భారత క్రికెట్‌కు మాత్రమే కాకుండా ప్రపంచ క్రికెట్‌కు కూడా ఆస్తి అని, అతనికి గౌరవం ఇవ్వాలని, ప్రైవసీని గౌరవించాలని క్రికెట్ ప్రేమికులు కోరుతున్నారు.
మరోవైపు, ఐపీఎల్ 2026లో ఆర్‌సీబీ జట్టు టైటిల్ గెల్చుకోవడంలో విరాట్ కీలక పాత్ర పోషించాడు. ఆ సమయంలో తనకు విరాట్ చాలా మార్గదర్శకత్వం చేశాడని, తన గేమ్‌పై దృష్టి పెట్టకుండా ఇతరులకు సహాయం చేయడం విరాట్‌లో ఉన్న అపూర్వ లక్షణమని కాక్స్ ప్రశంసించాడు.