ఎంత ఖర్చైనా నేనున్నా: చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు రాజగోపాల్ రెడ్డి అభయం
- మరోసారి తన ఉదారతను చాటుకున్న రాజగోపాల్ రెడ్డి
- తన మనవడిని కాపాడాలంటూ రాజగోపాల్ రెడ్డిని ఆశ్రయించిన వృద్ధుడు
- తన ఫౌండేషన్ ద్వారా పూర్తి వైద్యం చేయిస్తానన్న రాజగోపాల్ రెడ్డి
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తన ఉదారతను చాటుకొని ఒక నిరుపేద కుటుంబానికి కొండంత అండగా నిలిచారు. తల్లిదండ్రులు లేక, తీవ్ర అనారోగ్యంతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఒక చిన్నారికి తమ స్వచ్ఛంద సంస్థ ద్వారా పూర్తి ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నారు.
ఆ వృద్ధుడి కష్టాన్ని చూసి చలించిపోయిన రాజగోపాల్ రెడ్డి తక్షణమే స్పందించారు. ఆ చిన్నారి ప్రాణాలు కాపాడటానికి ఎంత ఖర్చైనా వెనకాడేది లేదని స్పష్టం చేశారు. తమ ఫౌండేషన్ ద్వారా ఆపరేషన్ తో పాటు పూర్తి ఉచిత వైద్యం అందించి, బాబును మళ్లీ ఆరోగ్యంగా ఇంటికి పంపే బాధ్యత తనదేనని కొండంత భరోసా ఇచ్చారు. ఆపదలో ఉన్న తమను దేవుడిలా ఆదుకోవడానికి ముందుకు వచ్చిన ఎమ్మెల్యేకు ఆ వృద్ధుడు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది.