ర్యాటిల్ స్నేక్ కాటు... 54 యాంటీవీనమ్ ఇంజెక్షన్లు వేస్తే బతికాడు!
- కాలిఫోర్నియాలో రాటిల్ స్నేక్ కాటు
- రక్తనాళంలోకే పాము విషం
- 12 రోజులు ఐసీయూలో నరకం
- 54 యాంటీవీనమ్ వయల్స్‌తో కాపాడిన వైద్యులు
కాలిఫోర్నియాలో తన తల్లిదండ్రులను చూడ్డానికి వెళ్లిన ఓ వ్యక్తి రాటిల్ స్నేక్ కాటుకు గురై మృత్యువు అంచుల వరకు వెళ్లి వచ్చాడు. వైద్యులు అసాధారణ స్థాయిలో ఏకంగా 54 వయల్స్ యాంటీవీనమ్ ఇంజెక్షన్లు అందించి అతడి ప్రాణాలను కాపాడారు. ఈ ఘటన మే 26న ఉత్తర కాలిఫోర్నియాలోని ఒరోవిల్లేలో చోటుచేసుకుంది.
ఇడాహోకు చెందిన క్రిస్ హోవార్త్ అనే వ్యక్తి తన తల్లిదండ్రుల ఇంటి పెరట్లో వాటర్ లైన్‌ను పరిశీలిస్తుండగా, రాటిల్ స్నేక్ అతడిని రెండుసార్లు కాటేసింది. పాము కోర నేరుగా రక్తనాళంలోకి దిగడంతో విషం వేగంగా శరీరం అంతటా వ్యాపించింది. నిమిషాల వ్యవధిలోనే నాలుక మొద్దుబారిపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్రమైన వాపు వంటి లక్షణాలు కనిపించాయి.
వెంటనే అతడిని సమీపంలోని ఒరోవిల్లే ఆసుపత్రికి తరలించగా, 'డిస్సెమినేటెడ్ ఇంట్రావాస్కులర్ కోయాగ్యులేషన్' (డీఐసీ) అనే అరుదైన, ప్రమాదకరమైన ఆరోగ్య సమస్య తలెత్తినట్లు వైద్యులు గుర్తించారు. ఈ స్థితిలో శరీరంలోని రక్తం గడ్డకట్టే వ్యవస్థ దెబ్బతింటుంది. ఆసుపత్రిలో ఉన్న 36 యాంటీవీనమ్ వయల్స్‌ను ఆరు రోజుల పాటు ఇచ్చినా పరిస్థితి మెరుగుపడలేదు. దీంతో మెరుగైన చికిత్స కోసం అతడిని స్టాన్‌ఫర్డ్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ మరో 18 వయల్స్ ఇచ్చారు.
మొత్తంగా 12 రోజుల పాటు ఐసీయూలో చికిత్స పొందిన హోవార్త్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ భయంకర క్షణాలను గుర్తుచేసుకుంటూ, తాను బతుకుతాననే ఆశలు వదులుకుని తన ముగ్గురు పిల్లలకు వీడ్కోలు లేఖలు కూడా రాశానని అతడు తెలిపాడు. ప్రస్తుతం 80 శాతం కోలుకున్నప్పటికీ, కాలి వాపు, నొప్పితో ఇంకా బాధపడుతున్నాడు. పాములు తిరిగే ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించేందుకే తమ అనుభవాన్ని పంచుకుంటున్నట్లు హోవార్త్ కుటుంబ సభ్యులు తెలిపారు.