'మీ సేవలు స్ఫూర్తిదాయకం'.. వెంకయ్య నాయుడికి చంద్రబాబు బర్త్డే విషెస్
- 'ఎక్స్' వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి
- తెలుగు భాషాభివృద్ధికి వెంకయ్య సేవలను కొనియాడిన చంద్రబాబు
- సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్ష
వెంకయ్య నాయుడు సంపూర్ణ ఆయురారోగ్యాలతో, ఆనందంగా ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు. భారతీయ విలువలతో పాటు తెలుగు భాషాభివృద్ధికి ఆయన చేస్తున్న కృషి స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
"భారత మాజీ ఉపరాష్ట్రపతి, పద్మ విభూషణ్ శ్రీ వెంకయ్య నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. భారతీయ విలువలను, తెలుగుదనాన్ని సమున్నతంగా చాటుతూ, తెలుగు భాషాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న మీ సేవలు అందరికీ స్ఫూర్తిదాయకం. మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో, ఆనందంగా, మరెన్నో జన్మదిన వేడుకలను జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని చంద్రబాబు తన ట్వీట్లో పేర్కొన్నారు.