సీఎం చంద్రబాబు జిల్లాల బాట.. నేటి నుంచి ఐదు రోజుల పర్యటన
- నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు జిల్లాల్లో పర్యటించనున్న సీఎం
- ఇవాళ నెల్లూరులో పెన్షన్ల పంపిణీ, తిరుపతిలో హీరో మోటార్స్‌కు శంకుస్థాపన
- రూ.750 కోట్ల పెట్టుబడితో హీరో మోటార్స్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్ ఏర్పాటు
- రేపు మంగంపేట, తిరుపతిలో పలు కార్యక్రమాలకు హాజరుకానున్న ముఖ్యమంత్రి
పర్యటనలో భాగంగా ఇవాళ ఉదయం నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలోని పున్నపువారిపాలెంలో నిర్వహించిన ‘పేదల సేవలో’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ భరోసా లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. అనంతరం ఆయన తిరుపతి జిల్లా సత్యవేడుకు బయలుదేరి వెళ్లారు. అక్కడ ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హీరో మోటార్స్‌కు చెందిన గ్లోబల్ పార్ట్స్ సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కేంద్రాన్ని హీరో మోటార్స్ సంస్థ సుమారు రూ.750 కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు చేస్తోంది.
ఈ కార్యక్రమం ముగిశాక ముఖ్యమంత్రి ఇవాళ రాత్రికి శ్రీసిటీలోనే బస చేయనున్నారు. రేపటి పర్యటనలో భాగంగా మంగంపేటలో 'వీబీ జీ రామ్‌జీ' ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం తిరుపతిలో జరగనున్న జీఎస్డీపీ సదస్సుకు చంద్రబాబు హాజరవుతారు.