‘13 సిక్సర్లు కొడతా అన్నాడు’.. వైభవ్‌ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సంగక్కర

Vaibhav Suryavanshi said he would hit 13 sixes Kumar Sangakkara shares interesting facts
  • ఐపీఎల్‌లో జరిగిన ఆసక్తికర విషయం పంచుకున్న సంగక్కర
  • లక్నోతో జరిగిన మ్యాచ్‌లో వైభవ్‌ ఆత్మవిశ్వాసానికి సంగక్కర ఫిదా
  • 13 సిక్సులు కొడతా అని బరిలోకి దిగినట్లు వెల్లడి
  • ఆ మ్యాచ్‌లో 10 సిక్సులు కొట్టి 93 పరుగులు చేసిన వైభవ్‌
  • 221 పరుగులు ఛేదించి గెలిచిన రాజస్థాన్‌ రాయల్స్‌
  • వైభవ్ ఆత్మవిశ్వాసం అతడి వయసుకు మించినదని సంగక్కర ప్రశంస
15 ఏళ్ల క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆత్మవిశ్వాసానికి తాను కూడా ఆశ్చర్యపోయానని రాజస్థాన్ రాయల్స్ ప్రధాన కోచ్ కుమార సంగక్కర వెల్లడించాడు. ఐపీఎల్-2026లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌కు ముందు వైభవ్ చెప్పిన మాటలను ఆయన తాజాగా గుర్తుచేసుకున్నాడు.

221 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సిన మ్యాచ్‌కు ముందు డ్రెస్సింగ్ రూమ్‌లోకి వచ్చిన వైభవ్.. ‘‘కోచ్‌, టెన్షన్ పడొద్దు.. మ్యాచ్ మనదే’’ అని కన్నుగీటాడని సంగక్కర తెలిపాడు. ఆ తర్వాత సహచరులు డోనోవన్ ఫెరీరా, లువాన్-డ్రే ప్రిటోరియస్తో మాట్లాడుతూ.. ‘‘నేను ఈరోజు 13 సిక్సర్లు కొడతా.. మిగతాది మీరు చూసుకోండి’’ అని చెప్పాడని గుర్తుచేశాడు

మొదట అతడి మాటలను సరదాగా తీసుకున్న సహచరులు.. ఒక్కో సిక్సర్ కొడుతూ పోతుండగా నిజంగానే లెక్కపెట్టడం ప్రారంభించారని సంగక్కర చెప్పాడు. చివరకు వైభవ్ 13 సిక్సర్లు కాకపోయినా 10 సిక్సర్లు బాది 48 బంతుల్లో 93 పరుగులు చేసి రాజస్థాన్ విజయానికి బాటలు వేశాడు. ఆ మ్యాచ్‌లో రాజస్థాన్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

వైభవ్ ఆత్మవిశ్వాసం, ఒత్తిడిని ఎదుర్కొనే తీరు అతడి వయసుకు మించినదని సంగక్కర ప్రశంసించాడు. ఐపీఎల్-2026లో 776 పరుగులతో ఆరెంజ్ క్యాప్ గెలిచిన వైభవ్.. 72 సిక్సర్లు బాది క్రిస్ గేల్ పేరిట ఉన్న 59 సిక్సర్ల రికార్డును కూడా అధిగమించాడు.
Vaibhav Suryavanshi
Kumar Sangakkara
Rajasthan Royals
IPL 2026
Chris Gayle
IPL Orange Cap Winner

More Telugu News