అసలు నువ్వెవరు?: ప్రకాశ్ రాజ్‌పై జనసేన నేత తీవ్ర ఆగ్రహం
- షూటింగ్‌లకు ప్రకాశ్ రాజ్ ఎప్పుడైనా సమయానికి వచ్చారా అని నిలదీత
- దేశానికి, తెలంగాణకు ఆయన చేసిన సేవ ఏంటని ఎద్దేవా
- గద్దర్ విషయంలో పవన్ కల్యాణ్‌ను విమర్శించే హక్కు లేదని వ్యాఖ్య
"జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందో, పొత్తుతో వస్తుందో ఆయనకెందుకు? అసలు ప్రకాశ్ రాజ్ ఎవరు? మేమెందుకు ఆయనకు సమాధానం చెప్పాలి?" అని సాగర్ సూటిగా నిలదీశారు. ప్రశాంతంగా ఉన్నవారిని కెలకడం ప్రకాశ్ రాజ్‌కు అలవాటని ఆరోపించారు.
గద్దర్ అంశంపై మాట్లాడుతూ, "గద్దర్‌ను ఎవరు ఉపయోగించుకున్నారు? పవన్ కల్యాణ్ జేబు నుంచి నేరుగా డబ్బులు తీసుకునేంత చనువు తనకు ఉందని స్వయంగా గద్దరే చెప్పారు" అని ఆయన గుర్తుచేశారు. ప్రకాశ్ రాజ్ వృత్తిపరమైన ప్రవర్తనను కూడా సాగర్ ప్రశ్నించారు. "అసలు ఆయన ఎప్పుడైనా షూటింగ్‌కు సమయానికి వచ్చారా? మీరు ఎంత సహృదయులో మీ చిత్ర పరిశ్రమ వారిని అడిగితే తెలుస్తుంది" అంటూ ఎద్దేవా చేశారు.
ఈ దేశానికి, ప్రత్యేకించి తెలంగాణకు ప్రకాశ్ రాజ్ చేసిన తోడ్పాటు ఏమిటని సాగర్ ప్రశ్నించారు. "తెలంగాణ సాయుధ పోరాటం, రజాకార్ ఉద్యమంలో పాల్గొని కుటుంబాలను పోగొట్టుకుంది ప్రకాశ్ రాజా?" అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. "అసలు నువ్వెవరు ప్రకాశ్ రాజ్?" అని సూటిగా ప్రశ్నించిన ఆయన, తెలంగాణకు ప్రకాశ్ రాజ్ చేసిన సేవ ఏంటని నిలదీశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల రాజకీయ వ్యవహారాల్లో తలదూర్చడం ఆయనకు అలవాటుగా మారిందని విమర్శించారు.