తంబళ్లపల్లెలో జనసేన కార్యాలయంపై వైసీపీ దాడి అత్యంత హేయం: నాదెండ్ల మనోహర్
- అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో జనసేన కార్యాలయంపై దాడి
- స్థానిక ఎన్నికల నామినేషన్ల వేళ వైసీపీ గూండాల పనేనని ఆరోపణ
- గెలవలేమనే వైసీపీ హింసకు పాల్పడుతోందన్న నాదెండ్ల మనోహర్
- దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో జనసేన పార్టీ కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయని, దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా ఈ దాడి జరగడం అత్యంత హేయమైన చర్య అని ఆయన అభివర్ణించారు. ఓటమి భయంతోనే వైసీపీ హింసకు పాల్పడుతోందని, రాష్ట్రంలో అశాంతి సృష్టించాలని చూస్తోందని ఆయన ఆరోపించారు.
తంబళ్లపల్లెలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లు దాఖలు చేయడానికి వెళుతున్న జనసేన నాయకులు, కార్యకర్తలను వైసీపీ శ్రేణులు కవ్వించి దాడులకు తెగబడ్డాయని నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీడీవో కార్యాలయం సమీపంలోని జనసేన కార్యాలయాన్ని ధ్వంసం చేయడమే కాకుండా, కొన్ని వాహనాలను కూడా నాశనం చేశారని, అడ్డు వచ్చిన వారిపై మారణాయుధాలతో దాడి చేశారని ఆయన ఆరోపించారు.
"రాష్ట్రంలో అలజడులు, గొడవలు సృష్టించి స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపివేయాలనే దురుద్దేశంతోనే వైసీపీ ఈ దుశ్చర్యలకు పాల్పడుతోంది. ఎన్నికల్లో గెలవలేమని స్పష్టంగా అర్థం కావడంతోనే హింస మార్గాన్ని ఎంచుకుంది" అని మనోహర్ విమర్శించారు. జనసేన ఇలాంటి గూండా చర్యలను చూస్తూ ఊరుకోదని ఆయన హెచ్చరించారు.
ఈ ఘటనను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తీవ్రంగా పరిగణించి, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. పోలీసు యంత్రాంగం కూడా వెంటనే స్పందించి దాడికి పాల్పడిన వారిని, వారి వెనుక ఉన్న సూత్రధారులను అరెస్టు చేయాలని కోరారు. ప్రజాస్వామ్యవాదులందరూ వైసీపీ చేస్తున్న ఈ అరాచక చర్యలను ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు.