జనసేన 'గ్రాడ్యుయేట్ ఎక్స్ ప్రెస్' ప్రారంభించిన పవన్ కల్యాణ్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం జనసేన ప్రచార రథం ప్రారంభం
- 'గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్'ను జెండా ఊపి ప్రారంభించిన పవన్ కల్యాణ్
- అభ్యర్థి గడల శ్రీనివాసరావు గెలుపునకు పలు సూచనలు
- యువత సమస్యలు తెలుసుకునే వేదికగా ఉండాలని పిలుపు
ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి జనసేన సిద్ధమైంది. ఈ ఎన్నికల కోసం ప్రత్యేకంగా రూపొందించిన 'జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్' ప్రచార రథాన్ని పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ శుక్రవారం హైదరాబాదులో ప్రారంభించారు.
ఈ సందర్భంగా వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా బరిలో ఉన్న డాక్టర్ గడల శ్రీనివాసరావుకు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రచారానికి సంబంధించి ఆయనకు పలు సూచనలు చేశారు.
ఈ 'గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్' కేవలం ఎన్నికల ప్రచార వాహనంగానే పరిమితం కాకూడదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. యువత ఎదుర్కొంటున్న సమస్యలను నిరంతరం తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి కృషి చేసే ఒక ప్రజాసేవా వేదికగా ఇది కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. హైదరాబాదులోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.