స్థానిక ఎన్నికల్లోనూ కలిసే బరిలోకి.. టీడీపీ-జనసేన మధ్య సీట్ల సర్దుబాటు పూర్తి
- స్థానిక ఎన్నికలపై టీడీపీ-జనసేన చర్చలు సఫలం
- 2024 తరహాలోనే కలిసే పోటీకి నిర్ణయం
- రెండు రోజుల్లో ఉమ్మడి అభ్యర్థుల జాబితా విడుదల చేస్తామన్న నేతలు
- 2029 ఎన్నికల్లోనూ పొత్తు కొనసాగుతుందని స్పష్టం
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు విజయవంతంగా ముగిసినట్లు జనసేన నేతలు బొలిశెట్టి శ్రీనివాస్, వంశీకృష్ణ యాదవ్, చిల్లపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో బుధవారం రాత్రి జనసేన విప్ పి. హరిప్రసాద్, మరో నేత పెండెం దొరబాబుతో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. కూటమిలో ఎలాంటి విభేదాలు లేవని, 2024 అసెంబ్లీ ఎన్నికల స్ఫూర్తితోనే బరిలోకి దిగుతామని వారు స్పష్టం చేశారు.
కేవలం గెలుపు అవకాశాలనే ప్రామాణికంగా తీసుకుని సీట్ల కేటాయింపు జరిగిందని వారు తెలిపారు. సీట్ల సంఖ్య కంటే విజయమే తమకు ముఖ్యమని పేర్కొన్నారు. మరో రెండు రోజుల్లో ఏ పార్టీ ఎక్కడెక్కడ పోటీ చేస్తుందనే వివరాలతో పాటు, ఉమ్మడి అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేస్తామని వెల్లడించారు. ఇరు పార్టీల కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
2024 ఎన్నికల్లో ప్రజలు కూటమిని విశ్వసించి ఓటేశారని, ఆ తీర్పును తాము గౌరవిస్తామని నేతలు పేర్కొన్నారు. కూటమిలో విభేదాలు ఉన్నాయంటూ సాగుతున్న ప్రచారానికి తావు ఇవ్వకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇదే పొత్తు 2029 ఎన్నికల్లోనూ కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.
జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆలోచనలకు అనుగుణంగానే సీట్ల సర్దుబాటు జరిగిందని నేతలు వివరించారు.