కాంగ్రెస్‌ను మనం ఎప్పటికీ నమ్మకూడదు.. మన దరిదాపులకు కూడా రానివ్వకూడదు: ఉదయనిధి స్టాలిన్
- విజయ్ ప్రభుత్వానికి మద్దతివ్వడంతో కాంగ్రెస్‌పై డీఎంకే తీవ్ర ఆగ్రహం
- కాంగ్రెస్‌కు కృతజ్ఞత, పద్ధతి లేవన్న ఉదయనిధి స్టాలిన్
- దేశంలో బీజేపీ ఎదుగుదలకు కాంగ్రెస్సే కారణమని సంచలన ఆరోపణ
- నటుడు విజయ్ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలవదని ఎంకే స్టాలిన్ వ్యాఖ్య
- డీఎంకే పాత మిత్రపక్షాలన్నీ విజయ్ పార్టీ వైపు మొగ్గు
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవలి ఎన్నికల తర్వాత నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) మైనారిటీ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించడంతో, డీఎంకే కూటమిలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో డీఎంకే యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్, కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ను 'వెన్నుపోటుదారు' అని అభివర్ణిస్తూ, ఆ పార్టీని ఇకపై ఎప్పటికీ నమ్మవద్దని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఒక పార్టీ కార్యక్రమంలో మాట్లాడిన ఉదయనిధి, "ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నాయకత్వం, డీఎంకే కార్యకర్తల కృషితోనే కాంగ్రెస్ ఐదుగురు ఎమ్మెల్యేలను గెలుచుకుంది. కానీ ఈ రోజు కనీస కృతజ్ఞత, పద్ధతి లేకుండా పదవుల కోసం మాకు చెప్పకుండానే వెళ్లిపోయారు. ఇలాంటి కాంగ్రెస్‌ను మనం ఎప్పటికీ నమ్మకూడదు, మన దరిదాపులకు కూడా రానివ్వకూడదు. తమిళనాడు ప్రజలు త్వరలోనే వారికి తగిన గుణపాఠం చెబుతారు" అని తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు.
దేశవ్యాప్తంగా బీజేపీ విజయానికి ప్రధాని మోదీ, అమిత్ షా కారణమని తాను భావించానని, కానీ వాస్తవానికి కాంగ్రెస్ పార్టీయే బీజేపీ ఎదుగుదలకు అసలు కారణమని ఇప్పుడు స్పష్టమైందని ఉదయనిధి ఆరోపించారు. గత పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో తమ నేత ఎంకే స్టాలిన్ కాంగ్రెస్‌ను తన భుజాలపై మోశారని గుర్తుచేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ను "వెన్నుపోటుదారులు", "మిత్రపక్షాల శ్రమపై బతికే జలగలు" అని అభివర్ణిస్తూ డీఎంకే తీర్మానాలు కూడా ఆమోదించింది.
టీవీకే ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ విమర్శలు
మరోవైపు, డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా టీవీకే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. విజయ్ ప్రభుత్వం తన ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకోదని జోస్యం చెప్పారు. "వారు 13 మంది, 107 మంది ఎమ్మెల్యేల మద్దతుతో 120 సంఖ్యను చూపారు. కానీ ఈ ప్రభుత్వం ఎప్పుడైనా, ఏ రోజైనా కూలిపోవడం ఖాయం," అని అన్నారు. సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్ వంటి పార్టీలు మొదట బయటి నుంచి మద్దతు ఇచ్చి, ఇప్పుడు మంత్రివర్గంలో చేరడాన్ని ఆయన తప్పుబట్టారు. "కొత్త బొమ్మలతో పిల్లలకు కొన్ని రోజుల్లోనే బోర్ కొట్టినట్లు, నటుడి పాలనతో ప్రజలకు కూడా విసుగు వస్తుంది. తల్లి కోసం పరితపించే పిల్లల్లా మళ్లీ మా వైపు చూస్తారు" అని స్టాలిన్ వ్యాఖ్యానించారు. 2019 నుంచి డీఎంకే మిత్రపక్షాలుగా ఉన్న ఈ పార్టీలన్నీ ఇప్పుడు విజయ్ వైపు మొగ్గు చూపడం తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.